‘bangaram saysSS’ హ్యాష్ ట్యాగ్ అర్దం ఇదే..

Published : Dec 31, 2018, 11:50 AM IST
‘bangaram saysSS’ హ్యాష్ ట్యాగ్ అర్దం ఇదే..

సారాంశం

రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్‌ వివాహం రాజస్థాన్‌లో బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మధ్య ఘనంగా జరిగింది.

రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్‌ వివాహం రాజస్థాన్‌లో బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మధ్య ఘనంగా జరిగింది. స్టార్ అంతా   కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక జయపురలో జరిగింది. ఈ నేపథ్యంలో అగ్ర తారలంతా శుక్రవారమే జయపురకు చేరుకున్నారు. శనివారం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా కార్తీకేయ, పూజల వివాహం జరిగింది.

ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్‌ల మధ్య సరదా సరదా సన్నివేశాలు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇక ఈ పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌ అవుతోంది. 

అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌ వెనక ఉన్న అర్థం ఏంటేంటే.. కార్తికేయ.. తన భార్య పూజను బంగారం అని పిలుస్తారట. పూజ..కార్తికేయను ‘ss’ అని ఇంటి పేరుతో సంబోధిస్తారట. అందుకే శుభలేఖలోనూ ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా అచ్చువేయించినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌