'డీజే టిల్లు' వాయిస్‌ తో గమ్మత్తుగా టీజర్‌.. చూశారా?

Published : Jun 21, 2023, 02:33 PM IST
'డీజే టిల్లు' వాయిస్‌ తో గమ్మత్తుగా టీజర్‌.. చూశారా?

సారాంశం

టీజర్ లోనే విషయం లేకపోతే సినిమా ఏం తీస్తాడులే అని ఓపినింగ్స్ కూడా రానిపరిస్దితులో ఇలాంటి టెక్నిక్ లు అన్ని అవసరమే అనిపిస్తున్నాయి.  

ఏదో ఒక కొత్తదనం లేకపోతే టీజర్ లేదా ట్రైలర్ ఏదైనా చిన్న హీరోలవి జనం పట్టించుకోవటం లేదు. అందుకే జనాలు మాట్లాడుకునే మేటర్ కోసం దర్శక,నిర్మాతలు తపిస్తున్నారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.  ప్రముఖ సంగీత దర్శకుడు  కీరవాణి(Keeravani) కుమారుడు శ్రీ సింహ ..భాగ్ సాలే(Bhaag Saale)అనే మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీ సింహ, నేహా సోలంకి(Neha Solanki) జంటగా ప్రణీత్ దర్శకత్వంలో బిగ్ బెన్ సినిమాస్ తో పాటు మరో రెండు నిర్మాణ సంస్థలు కలిసి భాగ్ సాలే సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా భాగ్ సాలే టీజర్ ని రిలీజ్ చేశారు. 

ది వరల్డ్ అఫ్ భాగ్ సాలే అంటూ నేడు ఓ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా కూడా హీరో సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో ఉంది. స్వతంత్రం ముందు ఇండియాలో దొరికిన ఒక వజ్రం ప్రపంచం అంతా తిరిగి తిరిగి అందులో ఒక ముక్క నైజాం రాజుల దగ్గర ఉంగరంగా మారితే ఆ ఉంగరాన్ని కొట్టేసిన ఫ్యామిలీ అంటూ ఓ కథని తన వాయిస్ ఓవర్ తో చెప్పుకొచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ. టీజర్ లోనే విషయం లేకపోతే సినిమా ఏం తీస్తాడులే అని ఓపినింగ్స్ కూడా రానిపరిస్దితులో ఇలాంటి టెక్నిక్ లు అన్ని అవసరమే అనిపిస్తున్నాయి.  
 
 సిద్దూ స్టోరీ నరేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఆ వజ్రపు ఉంగరం చుట్టూ తిరిగే కథ అయి ఉంటుందని, ఆ ఉంగరం హీరో దగ్గర ఉండొచ్చని తెలుస్తుంది. కామెడీ సస్పెన్స్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.  ఈ భాగ్ సాలే సినిమా జులై 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

 ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు