నా పగ తీరింది.. జగన్ గెలుపుపై శ్రీరెడ్డి కామెంట్స్!

Published : May 23, 2019, 01:23 PM IST
నా పగ తీరింది.. జగన్ గెలుపుపై శ్రీరెడ్డి కామెంట్స్!

సారాంశం

ఏపీలో వైఎస్సార్ సీపీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఏపీలో వైఎస్సార్ సీపీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపుగా జగన్ గెలుపు ఖాయమనే విషయం తెలిసిపోతోంది. దీంతో ఇప్పటినుండే సందడి షురూ చేసేశారు.

వైసీపీ ప్రభంజనంతో సినీ నటి శ్రీరెడ్డి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. వైసీపీ గెలుపుపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. తన పగ తీరిందని ప్రత్యర్ధులపై పంచ్ వేసింది. ''నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్'' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కి బాహుబలి అనుష్క పక్కన తన ఫోటోని పెట్టుకొని షేర్ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Anasuya: జబర్దస్త్ లో జరిగినదానికి నాకు సంబంధం లేదు అంటూ అనసూయ ట్విస్ట్.. హద్దులు దాటిన మాట వాస్తవమే కానీ
Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ