నాగబాబుపై శ్రీరెడ్డి వివాదాస్పద పోస్ట్!

Published : May 24, 2019, 11:19 AM IST
నాగబాబుపై శ్రీరెడ్డి వివాదాస్పద పోస్ట్!

సారాంశం

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ దూసుకుపోయింది. 151 సీట్లు గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు.

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ దూసుకుపోయింది. 151 సీట్లు గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ చేతులో ప్రత్యర్ధులు చిత్తుగా ఓడిపోయారు. దీంతో వైసీపీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.

మరోపక్క జగన్ చేతిలో ఓడిపోయిన టీడీపీ, జనసేన పార్టీలు ఘోర ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది నటి శ్రీరెడ్డి. మొదటి నుండి జనసేన పార్టీని సందర్భం వచ్చిన ప్రతీసారి తిడుతూనే ఉంది శ్రీరెడ్డి.

ఇప్పుడు పవన్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే రావడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ పవన్ అభిమానులు ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పుడు నాగబాబుపై ఓ పోస్ట్ పెట్టింది. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు జనసేన పార్టీ నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగబాబు ఓడిపోవడంతో తనదైన శైలిలో నాగబాబుని తిట్టిపోసింది.

''మూలశంఖోడు ఎంపీ అయిపోదామనుకున్నాడు కదా.. స్నేక్ బాబు ఎక్కడ..?? జబర్దస్త్ రీఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర వెయిటింగ్ అంటగా'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన జనసైనికులు శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

2025 Google లో ఎక్కువగా సెర్చ్ చేసిన 10 ఇండియన్ సినిమాలు
Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?