కంగనాకు తలపొగరు...ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Published : Sep 06, 2020, 03:05 PM ISTUpdated : Sep 06, 2020, 03:10 PM IST
కంగనాకు తలపొగరు...ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

సారాంశం

బాలీవుడ్ లో నెపోటిజంకి వ్యతిరేకంగా హీరోయిన్ కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా వివాస్పదం అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను కొందరు సమర్దిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా కంగనా తీరుపై ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి స్పందించడం జరిగింది.

ప్రతి వివాదంపై తనదైన శైలిలో స్పందించే శ్రీరెడ్డి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసుపై కంగనా రనౌత్ వ్యాఖలపై తన గళం విప్పింది. కంగనా రనౌత్ కి తలపొగరు ఎక్కిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విషయంలోకి వెళితే కొంత కాలంగా బాలీవుడ్ పెద్దలకు వ్యతిరేకంగా కంగనా రనౌత్ ఉద్యమం చేస్తుంది. వీలు దొరికినప్పుడల్లా కంగనా రనౌత్ మరియు ఆమె సిస్టర్ రంగోలి బాలీవుడ్ లో కొందరు దర్శక నిర్మాతలను, హీరో హీరోయిన్స్ ని ఏకిపారేశేవారు. 

కంగనాకు బాలీవుడ్ లో కొందరు అన్యాయం చేస్తున్నారని ఈ సిస్టర్స్ గళమెత్తే వారు. కంగనా కేంద్రంగా అనేక వివాదాలు కూడా నడిచాయి. కాగా సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తరువాత బాలీవుడ్ బడా బాబులు మరియు స్టార్ కిడ్స్ పై విమర్శల దాడి పెరిగింది. సుశాంత్ ఫ్యాన్స్ మరియు నెటిజెన్స్ నెపోటిజం కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కంగనా సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలతో దాడి   తీవ్రత పెంచింది. కంగనా పోస్ట్ లు  చాల వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా పై శ్రీ రెడ్డి ఫైర్ అయ్యింది. కంగనాకు తలపొగరు ఎక్కిందని అన్నారు. అంత మంచి నటిగా పేరుతెచ్చుకొని, స్టార్ డమ్ సొంతం చేసుకున్న కంగనా ఇంత దారుణంగా మాట్లాడడం సరికాదు అన్నారు. ఐతే శ్రీరెడ్డి కంగనాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తుంది. 
 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది