ప్రభాస్ కి కూడా ఆ పిచ్చి ఉంది... అవును అతనితో కనెక్షన్ పెట్టుకున్న : శ్రీరెడ్డి

Published : Mar 17, 2018, 11:53 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ప్రభాస్ కి కూడా ఆ పిచ్చి ఉంది... అవును అతనితో కనెక్షన్ పెట్టుకున్న : శ్రీరెడ్డి

సారాంశం

రోజు రోజుకు శ్రీరెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి అవకాశాల మాటున అమ్మాయిలను అంగడి బొమ్మల్లా మారుస్తున్నారు ప్రభాస్‌పై కూడా కొన్ని విమర్శలు చేశారు శ్రీరెడ్డి​

రోజు రోజుకు శ్రీరెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి . అవకాశాల మాటున అమ్మాయిలను అంగడి బొమ్మల్లా మారుస్తున్నారని, ప్రముఖ దర్శక నిర్మాతలు, టాప్ హీరోలు అని చెప్పుకునేవాళ్లకు సైతం ఇందులో హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అవకాశాల కోసం ఓ బడా నిర్మాత కొడుకుతో తాను ప్రేమ వ్యవహారం నడపాల్సి వచ్చిందని మరో సంచలన విషయం చెప్పారు.


అవకాశాల కోసం బడా నిర్మాత కొడుకుకు దగ్గరవాల్సి వచ్చిందని.. తద్వారా వాళ్ల ప్రొడక్షన్ లో తెరకెక్కే సినిమాల్లో తనకేమైనా అవకాశాలు ఇప్పిస్తాడేమోనని భావించినట్టు శ్రీరెడ్డి చెప్పారు. కనెక్షన్ పెట్టుకున్నా సరే.. తనకు మాత్రం అవకాశాలేవి రాలేదని వాపోయారు. అయితే సదరు నిర్మాత కొడుకు ఎవరన్నది మాత్రం ఆమె బయటపెట్టలేదు. అయితే బడా నిర్మాత అంటూ క్లూ ఇవ్వడంతో.. ఇండస్ట్రీలో కొంతమంది పేర్ల చుట్టూ ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.


ప్రభాస్‌పై కూడా కొన్ని విమర్శలు చేశారు శ్రీరెడ్డి. ప్రభాస్ హైట్ పిచ్చోడు అని కామెంట్ చేశారు. హైట్ ఉన్నవాళ్లనే తన పక్కన హీరోయిన్లుగా పెట్టుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. ఏం నిత్యా మీనన్ హైట్ తక్కువగా ఉన్నా.. ఎంత బాగా యాక్ట్ చేయట్లేదు, సమంత చేయట్లేదా? అని ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-జ్యోను మనుమరాలే కాదన్న శివన్నారాయణ-నిజం తెలిసిపోయిందా?
అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?