ఎంపీ కవితపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

Published : Sep 19, 2018, 10:46 AM ISTUpdated : Sep 19, 2018, 10:49 AM IST
ఎంపీ కవితపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి కోలీవుడ్ తారలను కూడా విడిచిపెట్టలేదు. తరచూ సినీ తారలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. 

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి కోలీవుడ్ తారలను కూడా విడిచిపెట్టలేదు. తరచూ సినీ తారలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా ఆమె విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలపై స్పందించారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కంటే ఆర్ధిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఇది మహిళలను అవమానించినట్లేనని శ్రీరెడ్డి వెల్లడించింది.

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరిగిన గొడవల గురించి ప్రస్తావిస్తూ.. ఆర్ధిక లావాదేవీలపై శివాజీరాజా, నరేష్ మధ్య వివాదం చెలరేగడం, తరువాత రెండు రోజులకే సమస్య పరిష్కారమైందని చెప్పడం చూస్తుంటే ఆర్ధిక అంశాలే కీలకమైనవనే అభిప్రాయం కలుగుతుందని అన్నారు.

ఎంపీ కవిత కూడా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాల గురించే మాట్లాడతారు కానీ మహిళల అంశాలను పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందని అన్నారు. ఇదే ప్రెస్ మీట్ లో పాల్గొన్న మరో నటి అపూర్వ.. నిరసన చేపట్టిన కళాకారులకు అవకాశాలు ఇవ్వకపోవడం బాధగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్