శ్రీదేవి శోభన్ బాబు మూవీ టీజర్ కు బారీ రెస్పాన్స్, నిర్మాతగా మెగా డాటర్ సక్సెస్…?

Published : Apr 07, 2022, 09:53 PM IST
శ్రీదేవి శోభన్ బాబు మూవీ టీజర్ కు బారీ రెస్పాన్స్, నిర్మాతగా మెగా డాటర్ సక్సెస్…?

సారాంశం

మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా వెబ్ మూవీస్ వరుసగా నిర్మిస్తున్నారు. ఆమె రీసెంట్ గా సినిమా నిర్మాతగా మరిపోయింది. రీసెంట్ గా ఆమె నిర్మించిన మూవీ శ్రీదేవి శోభన్ బాబు. ఈసినిమా టీజర్ దూసుకుపోతోంది. వ్యూస్ తో అదరగోడుతోంది. 

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొంత కాలంగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ బిజీ అయిపోయారు. రీసెంట్ గా ఆమె సినిమాలను నిర్మించే దిశగా అడుగులు వేశారు. తన బ్యానర్ పై శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. యంగ్ హీరో సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయ్యింది.  

ఈ టీజర్ ఆడియన్ ను గట్టిగానే ఆకట్టుకుంటుంది.  టైటిల్ క్యాచీగా ఉండటం .. మాస్ అంశాలు ఉండటంతో ఈ టీజర్ చాలా స్పీడ్ గానే కనెక్ట్ అయింది. అంతే కాదు ఈ టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వస్తోంది. టీజర్ రిలీజ్ అయిన  24 గంటల్లో 10 లక్షలకు పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. ఈ సంతోషంలో దీనికి  సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 

సిటీతో పాటు విలేజ్  నేపథ్యంలో నడిచే కథతో సినిమా తెరకెక్కుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేలా ఈ కథ ఉంటుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కుమరన్ సంగీతాన్ని అందించారు. సంతోష్ శోభన్ యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. మంచి రోజులు వచ్చాయి తరువాత సంతోష్ శోభన్ నుంచి వస్తున్న సినిమా ఇది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?