
బిగ్‌బాస్ తెలుగు 5 101వ రోజు షో ...ఎమోషన్స్, సరదా, మెమరబుల్ మూవ్‌మెంట్స్ తో సాగింది. ఇంటి సభ్యులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బిగ్‌బాస్ ఐదో సీజన్ దగ్గర పడే కొద్ది షో చాలా ఎమోషనల్‌గా మారిపోతుంది. గుండెలను బరువెక్కిస్తుంది. దాదాపు వంద రోజులుగా ఇంటిళ్లిపాదిని అలరించిందీ షో. బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగే ప్రతి విషయంపై మాట్లాడుకోవడం, వాటిపై విమర్శలు చేయడం, కొన్ని ప్రశంసించడం, జోకులకు నవ్వడం, కొందరు సభ్యులను తిట్టడం, మరికొందరిని ప్రశంసించడం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు షో చివరి దశకు చేరుకోవడంతో ఇక ఆ సందడి లేదనే ఫీలింగ్ ఆడియెన్స్ లో కలుగుతుంది.
ఇలాంటి ఎమోషనల్ భావాల నేపథ్యంలో బుధవారం ఎపిసోడ్ ఆద్యంతం సందడిగా సాగింది. ప్రారంభంలో సన్నీ తన జర్నీ చూసుకుని రెండు ఫోటోలను తీసుకుని వచ్చాడు. అంతేకాదు తనకోసం కేక్‌ని సపరేట్‌గా పెట్టించారు బిగ్‌బాస్. దీంతో మరో ఆలోచన లేకుండా ఆ కేక్ తీసుకెళ్లాడు సన్నీ. ఈ సారి హౌజ్‌లో ఇతర సభ్యులకు కూడా పంచి సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం కాసేపు దాగుడు మూతల టాస్క్ ఆడిపించారు. ఇందులో సన్నీ, మానస్ పాల్గొన్నారు. ఈ గేమ్ సభ్యులకు ఉల్లాసాన్నిచ్చిందని చెప్పాలి.
అనంతరం సిరి గార్డెన్ ఏరియాకి పిలిచారు. ఆమె జర్నీని చూపించారు. ఫోటోల రూపంలో, ప్రదర్శించి అబ్బురపరిచారు. వాటిని చూసి సంతోషానికి గురైంది సిరి. మరోవైపు బిగ్‌బాస్..సిరి గురించి చెప్పిన వ్యాఖ్యాలు ఆద్యంతం ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. ఆమె పోరాట పటిమని అభినందించారు. అల్లరి పిల్లగా వర్ణించాడు. టాస్క్ ల్లో రాక్షసి మాదిరిగా ఆడటాన్ని అభినందించాడు. మొత్తంగా సిరిని ఓ స్పెషల్ పర్సన్‌గా చూపించారు బిగ్‌బాస్. ఆమెకి అభినందనలు తెలిపారు. మరోవైపు సిరి జర్నీని చూపించగా,దానికి ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. ఆ జర్నీ కంటే బిగ్‌బాస్ చెప్పిన వ్యాఖ్యలు తనని ఎంతో కదిలించాయని, గొప్ప అనుభూతికి గురి చేశాయని తెలిపింది. ఒక ఒక్క ఫోటో తీసుకెళ్లు అంటూ ఐదు ఫోటోలు తీసుకెళ్లింది సిరి. మధ్యలో బిగ్‌బాస్ చెప్పినా కూడా వినకుండా ఏకంగా ఆయనకు ఝలక్ ఇచ్చింది.
మరోవైపు గార్డెన్ ఏరియాలో ఫైనలిస్ట్ లు సన్నీ, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్, సిరిలకు సంబంధించిన కొన్ని మెమరబుల్ ఫోటోలను ఉంచాడు. వాటిలో ఒకటి ఎంపిక చేసుకుని ఆ ఫోటో గురించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఆ ఫోటోని బిగ్‌బాస్‌కి ఇస్తూ దానిపై తమ సందేశాన్ని రాయాల్సి ఉంటుంది. మానస్.. తాను, సన్నీ, అనీ మాస్టర్ కలిసి హగ్ చేసుకున్న ఫోటోని ఎంపిక చేసుకుని దాని గురించి వివరించారు. బేటల్ కుట్టే టాస్క్ లో మొదట హోప్ పోయిందని, తర్వాత అదే నిబద్ధతతో ఆడితే విజయం సాధించామని, హోప్‌ని ఎప్పుడూ వదులుకోవద్దని తెలిపారు.
షణ్ముఖ్ తనకు వచ్చిన లెటర్ ని కట్ చేస్తూ దిగిన ఫోటోని ఎంపిక చేసుకున్నారు. ఈ లెటర్‌కి, టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో ఉన్నానని, దాన్ని సాధించాలనుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు సిరి.. షణ్ముఖ్ వెనకాల ఉన్న ఓ టాస్క్ ఫోటోని పంచుకుని,హౌజ్‌లో షణ్ముఖ్ మంచి ఫ్రెండ్‌లాగా ఉన్నాడని, తనకు బ్యాక్ బోన్‌లా ఎప్పుడూ వెనకాలే ఉన్నాడని చెప్పింది. శ్రీరామ్..హమీదతో ఉన్న ఫోటోని ఎంపిక చేస్తున్నారు. ఆమెని గుర్తు చేసుకున్నారు. హమీదపై తన ప్రేమని వ్యక్తం చేశాడు. తాను అరెంజ్ మ్యారేజ్ చేసుకుంటానా, లవ్ మ్యారేజ్ చేసుకుంటానో తెలియదుగానీ, ఈ అమ్మాయిని బాగా కనెక్ట్ అయ్యానని, హౌజ్ నుంచి బయటకు వెళ్లాక కచ్చితంగా కలుస్తానని తెలిపాడు.
సన్నీ.. వరస్ట్ పర్‌ఫర్మెన్స్ కి సంబంధించి ఫోటోని ఎంచుకుని, అందులో తాను బెస్ట్ ఇచ్చానని, కానీ అందరు నన్ను వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా ఇచ్చారని, అందులో తన టీమ్ వాళ్లు కూడా ఉండటం బాధాకరమని, జైల్లో ఉన్నా అదే విషయంపై బాధపడినట్టు తెలిపారు సన్నీ. అందుకే ఈ ఫోటోని ఎంపిక చేసినట్టు తెలిపారు సన్నీ. దీంతో బుధవారం ఎపిసోడ్ ముగిసింది. ఇంకా జస్ట్ మూడు రోజులు మాత్రమే షో ఉంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతున్న విషయం తెలిసిందే.