
రామ్ పోతినేని-బోయపాటి శ్రీను ఫస్ట్ టైం కలిసి చిత్రం చేస్తున్నారు. టైటిల్ ప్రకటించాల్సి ఉండగా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. ఇటీవల రామ్ పోతినేని బర్త్ డే కానుకగా ప్రోమో విడుదల చేశారు. మాస్ అవతార్ లో విలన్స్ ని ఇరగ్గొడుతున్న రామ్ ఆకట్టుకున్నారు. దున్నపోతుతో జాతరలో ఆయన హంగామా అదిరింది. ఇక బోయపాటి మార్క్ మాస్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ డేట్ పై చాలా చిత్రాలు కన్నేశాయి. ఈ క్రమంలో విడుదల తేదీ ముందుకు జరపాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అక్టోబర్ కి బదులు ఆగస్టులో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అదే జరిగితే దసరా కాంపిటీషన్ కొంచెం తగ్గినట్లు అవుతుంది. పోటీలో పడి నష్టపోయే కంటే కొంచెం కాంపిటీషన్ లేకుండా రావడం బెటరని మేకర్స్ బావిస్తున్నారట.
అధికారిక సమాచారం అందాల్సి ఉండగా టాలీవుడ్ వర్గాల్లో ఈ మేరకు చర్చ నడుస్తుంది. ఈ చిత్రంలో రామ్ పోతినేనికి జంటగా శ్రీలీల నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్నారు. కాగా అఖండ హిట్ తో బోయపాటి శ్రీను ఫార్మ్ లోకి వచ్చాడు. రామ్ మాత్రం వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కి హిట్ లేదు. బోయపాటి మీదే ఆశలు పెట్టుకున్నాడు.