ఉస్తాద్ సెట్ లో శ్రీలీల, పవన్ కళ్యాణ్ తో కలిసి ఫస్ట్ టైమ్ షూటింగ్ లో ధమాకా బ్యూటీ

Published : Apr 11, 2023, 11:47 AM ISTUpdated : Apr 11, 2023, 11:49 AM IST
ఉస్తాద్ సెట్ లో శ్రీలీల, పవన్ కళ్యాణ్ తో  కలిసి ఫస్ట్ టైమ్ షూటింగ్ లో ధమాకా బ్యూటీ

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సెట్లో సందడి చేసింది శ్రీలీల. ఉస్తాబ్ భగత్ సింగ్ లో ఒక హీరోయిన్ గా నటిస్తున్నఆమె.. తాజాగాషూటింగ్లో జాయిన్ అయ్యింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నసినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్  లో తెరకెక్కుతోన్న ఈసినిమా కోసం డైరెక్టర్  హరీశ్ శంకర్ మూడేళ్ళకుపైగా వెయిట్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడో ఈసినిమాను అనౌన్స్ చేసినా..పవర్ స్టార్ కు టైమ్ కుదరక ఈసినిమాను పెండింగ్ లో పెట్టారు.ఇక రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో పాటు... పవన కళ్యాణ్ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ దాదాపు 25 రోజులు ఈసినిమాకు టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది.  

ఇక  కొన్ని రోజులుగా ఈ సినిమా హైదరాబాద్ - అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగు జరుపుకుంటోంది. తాజాగా ఈ షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయినట్టుతెలుస్తోంది. ఈలోకేషన్ లో   శ్రీలీల కాంబినేషన్లోని సీన్స్ కూడా ఉండటంతో ఆమె ఈ రోజున సెట్స్ పైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ పవర్ స్టార్ తో కలిసి నటిస్తోంది శ్రీలీల. అయితే శ్రీలీల ఈసినిమాలో  మెయిన్ హీరోయిన్ గానే నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా  పూజ హెగ్డేను అనుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా  శ్రీలీలను సెట్ చేసుకున్నారు. కానీ పూజ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో, శ్రీలీలను ఆ ప్లేస్ లో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయయంలో అఫీషియల్ గా మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఒక వేలసెకండ్ హీరోయిన్ గా వేరే హీరోయిన్ ను తీసుకుంటారా..? లేక మెయిన్ హీరోయిన్ గానే ఇంకొక స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారా అనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక పవర్ స్టార్ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిస్తే ఎలా ఉంటోంది అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకి కూడా  ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో ఇప్పుడు శ్రీలీల ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాదిలో రానున్న చాలా ప్రాజెక్టులలో ఆమె సందడి చేయనుంది. ఒక వైపున బాలయ్య 108వ సినిమాలో .. మరో రామ్ .. నితిన్ సినిమాతో ఆమె బిజీగా ఉంది. తాజాగా ఈ రోజున ఆమె పవన్ సినిమా షూటింగులో పాల్గొనడానికి రంగంలోకి దిగిపోయింది. ఇలా టాలీవుడ్ లో వరుస సినిమాలతో.. వరుస సక్సెస్ లతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది బ్యూటీ. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే