మహేష్‌ బుగ్గపై శ్రీలీల అదిరిపోయే ముద్దు.. `గుంటూరు కారం` సెకండ్‌ సాంగ్ అప్‌డేట్‌..

Published : Dec 09, 2023, 06:02 PM IST
మహేష్‌ బుగ్గపై శ్రీలీల అదిరిపోయే ముద్దు.. `గుంటూరు కారం` సెకండ్‌ సాంగ్ అప్‌డేట్‌..

సారాంశం

మహేష్‌ బాబు, శ్రీలీల జంటగా నటిస్తున్న `గుంటూరు కారం` చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. రెండో పాటకి సంబంధించిన వివరాలు వెల్లడించింది. కానీ పోస్టర్‌ మాత్రం..

మహేష్‌ బాబు, శ్రీలీల జంటగా `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. టాకీ పార్ట్ పూర్తయ్యింది. పాటలను షూట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఓ పాటని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్‌ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది. రెండో పాటని విడుదల చేయబోతుంది యూనిట్‌. ఆ విషయాలను తాజాగా ప్రకటించింది. `ఓ మై బేబీ` అంటూ సాగే రెండో పాటని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాట ప్రోమోని విడుదల చేస్తామని, 13న పూర్తి పాటని విడుదల చేస్తామని తెలిపింది. 

ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో బెంచ్‌పై మహేష్‌బాబు కూర్చొని ఉండగా, హీరోయిన్‌ శ్రీలీల ఆయన బుగ్గపై అదిరిపోయే ముద్దు పెట్టింది. అయితే ఇందులో మహేష్‌ కాలుపై కాలేసుకుని కూర్చొన్నాడు. ఓ చేతిని ఆయన కాలుపై పెట్టి, మరో చేతితో మహేష్‌ ముఖాన్ని పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టడం విశేషం. దీంతో `గుంటూరు కారం` ఇచ్చిన సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ కంటే మహేష్‌కి శ్రీలీల పెట్టే ముందే హైలైట్‌గా మారింది. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికా అండ్‌ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది. ఈ మూవీలో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ ఆర్‌ఎఫ్‌సీలో ఉంటుందని, రేపటి నుంచి మహేష్‌ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇక సంక్రాంతికి జనవరి 12న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌