
శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’. ఆగష్ట్ 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. రివ్యూలు బాగా వచ్చాయి. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత శ్రీవిష్ణుకి మంచి విజయం దక్కిందని ట్రేడ్ లో అన్నారు.’అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి టాక్ కు తగ్గట్లు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తోందా లేదా చూద్దాం.
ఇప్పుడున్న పరిస్దితుల్లో ‘రాజ రాజ చోర’కు కలెక్షన్స్ ఏ స్దాయిలో ఉంటాయో ఊహించటం కష్టమే. అయితే టాక్ బాగుండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ మార్నింగ్ షోకే సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. దాంతో ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. కానీ సినిమాకి వచ్చిన హిట్ టాక్ కారణంగా రెండో షో నుంచే కలెక్షన్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లలో ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతోంది.
రిలీజ్ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలు వచ్చే సరికి చాలా చోట్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే శ్రీవిష్ణు మాస్ హీరో కాదనో,ధర్డ్ వేవ్ భయమో కానీ కలెక్షన్స్ టాక్ కు తగ్గట్లు కనపడటం లేదు. గురు, శుక్రవారంలో చాలా సెంటర్లలలో ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. ఇక అదే గురువారం నాడు రాజ రాజ చోరతో పాటుగా క్రేజీ అంకుల్స్, కనబడుట లేదు చిత్రాలు రిలీజయ్యాయి. శుక్రవారం బజార్ రౌడీ వచ్చింది.అయితే ఏ సినిమాకు పాజిటివ్ టాక్ లేదు. బాక్సాఫీస్ దగ్గర నిలబడ లేదు. కానీ ఆ ఇంపాక్ట్ కూడా రాజ రాజ చోర కలెక్షన్స్ పై కనపడటం లేదు.
శని, ఆదివారాల్లో ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ పెరుగుతుందని.. ఫుల్స్ కూడా పడతాయని ఎక్సపెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అదే జరిగితే ఈ చిత్రం వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంటుంది.