
మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు మణిశర్మ. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా శ్రీవిష్ణు బళా తందనాన సినిమా నుంచి గ్రీన్ టీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ తో తన క్రియేటివిటిని నిరూపించుకునారు మెలోడీ బ్రహ్మ.
డిఫరెంట్ సబ్జెక్ట్స్... డిఫరెంట్ మూవీస్ ను సెలక్ట్ చేసుకుంటూ.. టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించాడు శ్రీవిష్ణు. తెలుగు సినీమా రంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. సక్సెస్ పెయిల్యూర్ తో సంబంధంలేకుండా.. తన మార్క్ సెలక్షన్ తో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో గుర్తుండిపోయే సినిమాలు చేస్తుననాడు యంగ్ హీరో.
ఇక శ్రీవిష్ణు నటించిన స్పెషల్ మూవీ ‘భళా తందనాన. చైతన్య దంటులూరి దర్శకడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా టైటిల్ తోనే శ్రీవిష్ణు మార్క్ ను చూపిస్తోంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. సోషల్ ఇష్యూస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా మే 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. దాంతో ప్రమోషన్లను షురూ చేశారు మూవీ టీమ్. అందులో భాగంగానే భళా తందనాన మూవ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమానుంచి గ్రీన్ టీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో కూడా ఓ స్పెషాలిటీ ఉంది. పెప్పీ నెంబర్ సాంగ్‌గా సాగుతున్న ఈ పాటను ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఆలపించాడు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను పోసానితో కలిసి పృథ్వీ చంద్ర, హారికా నారాయణ్ ఆలపించారు. మణిశర్మ స్వర పరిచిన ఈ పాట వెస్టర్న్ స్టైల్లో క్యాచీగా ఉంది.
వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రాపాటి నిర్మించిన ఈసినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా కేథరీన్ థెరిస్సా నటించింది. కేజీఎఫ్ ఫేం గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాపై ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మే 6న మరికొన్ని సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. అన్నింటిని దాటుకుని శ్రీవిష్ణు సక్సెస్ సాధిస్తాడా లేదా చూడాలి.