రామ్ పోతినేని సరసన శ్రీలీలా.. అఫిషియల్ గా వెల్ కమ్ చెప్పిన మేకర్స్.. షూటింగ్ కూ ముహూర్తం ఫిక్స్.!

Published : Oct 05, 2022, 02:23 PM ISTUpdated : Oct 05, 2022, 02:28 PM IST
రామ్ పోతినేని సరసన శ్రీలీలా.. అఫిషియల్ గా వెల్ కమ్ చెప్పిన మేకర్స్.. షూటింగ్ కూ ముహూర్తం ఫిక్స్.!

సారాంశం

యంగ్ బ్యూటీ శ్రీలీలా టాలీవుడ్ లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఉస్తాద్ రామ్ పోతినేని తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. మేకర్స్ ఈరోజు అఫిషియల్ గా ఆమెకు స్వాగతం పలికారు.   

యంగ్ బ్యూటీ శ్రీలీలా  (Sree Leela) క్రేజ్ టాలీవుడ్ లో మామూలుగా లేదు. ‘పెళ్లిసందడి’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రేక్షకులను గ్లామర్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఈ తరం కుర్ర హీరోయిన్లలో శ్రీలీలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇప్పటికే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బడా స్టార్స్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన (Ram Pothineni) సరనన నటించే అవకాశం లభించింది.

రామ్ పోతినేని - ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో ఓ క్రేజీగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రం ప్రారంభం కావాల్సి ఉన్న ఆలస్యమవుతూ వస్తోంది. ఈ రోజు దసరా సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ‘బోయపాటి రాపో’ గురించి క్రేజీ డిటేయిల్స్ అందించారు. ముఖ్యంగా హీరోయిన్ శ్రీలీలాను రామ్ పోతినేని సరసన కన్ఫమ్ చేస్తూ.. ఆమెకు అఫిషియల్ గా వెల్కమ్ చెప్పారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గానూ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ను  ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.

అదేవిధంగా దసరా వేడుకల్లో మరింత జోష్ నింపుతూ సూపర్ ఎగ్జైటెడ్ న్యూస్ అందించారు. రేపటి నుంచి మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని అధికారిక ప్రకటన వెల్లడించారు. తొలిరోజే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘బోయపాటి - రాపో’ మూవీ రూపుదిద్దుకోనుంది. ది మాసీయెస్ట్ ఎనర్జిటిక్ కాంబినేషన్ గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి రామ్ పోతినేని  ఎలా చూపించబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..