ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవకు దారితీసిన స్పైడర్ ఫ్లెక్సీ వివాదం

Published : Sep 30, 2017, 05:29 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవకు దారితీసిన స్పైడర్ ఫ్లెక్సీ వివాదం

సారాంశం

స్పైడర్ ఫ్లెక్సీలపై గుంటూరు ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో గొడవ  ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటిని తొలగించిన మునిసిపల్ సిబ్బంది మండిపడుతున్న ఎంపీ వర్గీయులు, మహేష్ బాబు అభిమానులు మరోవైపు రాజమండ్రిలో మహేష్ కటౌట్ తగులబెట్టిన దుండగులు

 

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల సందర్భంగా ‘స్పైడర్’ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ ఫొటోలు ఉన్నాయి. దీంతో, ఆ ఫ్లెక్సీలపై తన ఫొటో లేదంటూ స్థానిక ఎమ్మెల్యే మనస్తాపం చెందారట. ఈ నేపథ్యంలో, ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ మునిసిపాలిటీ సిబ్బందిని ఆయన ఆదేశించడంతో వాటిని తీసివేశారట.



అదే సమయంలో ఈ ఫ్లెక్సీలను తొలగించవద్దంటూ ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో, సదరు ఎమ్మెల్యే తీరుపై ఎంపీ వర్గీయులు, మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఎంపీ వర్గీయులు సిద్ధపడినట్టు తెలుస్తోంది. 


 

ఇక తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్పైడర్ థియేటర్ల వద్ద సూపర్ స్టార్ మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్స్ , ప్లెక్సీ లు థియేటర్స్ దగ్గర ఏర్పటు చేసారు. రాజమండ్రిలోని గోవిందరాజు సెంటర్లో ఏర్పాటు చేసిన ఇలాంటి ఒక ఫ్లెక్సీని బుధవారం అర్ధరాత్రి ఎవరో తగుల బెట్టారు. ఈ విషయం తెలియడంతో మహేశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?