సరిగ్గా నెలరోజుల్లో ‘ఆదిపురుష్’ రిలీజ్.. న్యూ పోస్టర్ తో మరింత హైప్.. టార్గెట్ అదొక్కటే!

By Asianet News  |  First Published May 16, 2023, 4:22 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదరుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. సరిగ్గా నెలరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా లేటెస్ట్ అప్డేట్స్ తో అంచనాలు పెంచేస్తున్నారు. 
 


హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించిన ఈ చిత్రం  సరిగ్గా నెలరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 2డీ, 3డీలో ఐదు భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. వచ్చే నెలలోనే రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు.  ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించారు.

గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం నాసిరకమైన విజువల్స్, పలు విమర్శల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ తో నెగిటివిటీ మొత్తం తుడుచుకుపోయింది. విజువల్స్ పరంగా, టేకింగ్ పరంగా, మ్యూజిక్ పరంగానూ ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో మేకర్స్ వరుస అస్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. సినిమాపై మరింతగా హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ అద్భుతమైన పోస్టర్ ను విడుదల చేశారు. 

Latest Videos

లేటెస్ట్ పోస్టర్ లో రాముడిగా ప్రభాస్, హన్మంతుడిగా దేవదత్త ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఇంక త్రీడీ ఎఫెక్ట్స్ లో విజువల్ ట్రీట్ అని అర్థమవుతోంది. రాముడిగా ప్రభాస్ తొలిసారిగా గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ తప్పనిసరి అని అంటున్నారు. అన్నీ భాషల్లో పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఆదిరుపురుష్ లేటెస్ట్ పోస్టర్ పై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

పోస్టర్ ను విడుదల చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు.  ‘ప్రతి ఒక్కరిలోని భక్తి ఆదిపురుష్ రాకను వినిపిస్తోంది’ అంటూ తెలిపారు.  నిజానికి ప్రస్తుతం ‘ఆదిపురుష్’పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ ఇప్పటికే 2000 కోట్ల టార్గెట్ వసూల్ చేయాలంటూ పరోక్షంగా అంచనా వేశారు. ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 24 గంటల్లోనే 70 మిలియన్ల వ్యూస్ ను దక్కడం విశేషం. మున్ముందు వచ్చే అప్డేట్స్ తో ఆ స్థాయికి వెళ్లే అవకాశం లేకపోలేదు. 

ప్రభాస్ - కృతిసనన్ జంటగా సీతారాములుగా అలరించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రాముడి పాత్రను పోషించారు. సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిపురుష్‌ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

मंगलमय हर भक्त होगा,
जब आदिपुरुष का स्वागत होगा। 🙏

The devotion of everyone abounds,
As Adipurush's arrival resounds 🙏

One month to go!
Jai Shri Ram
जय श्री राम
జై శ్రీరాం
ஜெய் ஸ்ரீ ராம்
ಜೈಶ್ರೀರಾಂ
ജയ് ശ്രീറാം in cinemas worldwide on 16th June! ✨ pic.twitter.com/QSUZcI4wYi

— T-Series (@TSeries)
click me!