
హీరో మహేష్ బాబు షూటింగ్ విరామంలో ఉన్నారు. ఎస్ఎస్ఎంబి 28 నెక్స్ట్ షెడ్యూల్ కి గ్యాప్ రాగా మహేష్ సేద తీరుతున్నారు. ఈ స్టార్ హీరో తన లేటెస్ట్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మెస్సి హెయిర్, గడ్డంతో కూడిన మహేష్ సరికొత్తగా ఉన్నారు. మహేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
ఇక ఎస్ఎస్ఎం బి 28 చిత్ర షూటింగ్ జూన్ మొదటివారం నుండి తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. మూడు నెలలు నిరవధికంగా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ నందు చాలా వరకు షూటింగ్ కంప్లీట్ కానుందట. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సమయం తక్కువగా ఉంది. అందుకే మేకర్స్ బిజీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్ర టైటిల్స్ విషయంలో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు... ఇలా పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఫైనల్ గా ఏది నిర్ణయిస్తారనేది చూడాలి. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
మరోవైపు మహేష్ దర్శకుడు రాజమౌళి మూవీకి సన్నద్ధం అవుతున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. జంగిల్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కనుంది. ఈ చిత్ర బడ్జెట్ రూ. 800 కోట్లు అంటున్నారు. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో మహేష్ 29వ చిత్రం తెరకెక్కనుందట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారట.