గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి సాంగ్ రెడీ.. ప్రోమో వదిలిన విశ్వక్ సేన్ టీమ్..

Published : Aug 15, 2023, 12:13 PM ISTUpdated : Aug 15, 2023, 12:17 PM IST
గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి సాంగ్ రెడీ.. ప్రోమో వదిలిన విశ్వక్ సేన్  టీమ్..

సారాంశం

విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈసినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈమూవీ నుంచి  గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు మరింతగా పెంచారు టీమ్.  ఇప్పుడు సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. 

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్. రీసెంట్ గానే  దాస్ కా ధ‌మ్కీ సినిమాతో మాస్  హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న కుర్ర హీరో... ప్రస్తుతం వరుసగా  మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. క్షణం ఖాళీ లుకుండా బిజీగా ఉన్నాడు. ఇక తాను చేస్తున్న సినిమాల్లో కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈసినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈమూవీ నుంచి  గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు మరింతగా పెంచారు టీమ్.  

ఇక విశ్వక్ సేన్ కు జతగా.. ఈసినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి సందడి చేయబోతుండగా.. సీనియర్ హీరోయిన్ అంజలి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.ఇక ఈమూవీపై మరింత ఇంట్రెస్ట్ పెంచడానికి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారుటీమ్. ఫస్ట్ గ్లింప్స్ లో.. మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ మాస్ డైలాగ్ తో అదరగొట్టాడు. ఈసారి సాంగ్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా..  సుట్టంలా సూసి సాంగ్ ప్రోమోని నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే చీరలా.. అని ఈ పాట సాగనుంది. విశ్వక్, నేహా శెట్టి మధ్య ఈ పాట ఉండనుంది. పల్లెటూళ్ళో జరిగే ఓ ప్రేమకథలా కనిపిస్తుంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా రేపు ఆగస్టు 16న పూర్తి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.


 

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు విశ్వక్. గెలుపు, ఓటమి అనేది పట్టించుకోకుండా.. తన రూట్ లో తాను వెళ్తున్నాడు. అందుకే ఈ హీరోకు సెపరేట్ ఇమేజ్ వచ్చింది. గుంపులో ఒక హీరోలా కాకుండా.. కాస్త భిన్నంగా కనిపిస్తాడు. ఆ రకంగానే ఆడియన్స్ లో రిజిస్టర్ అయ్యాడు విశ్వక్ సేన్. త్వరలో పెళ్ళి  కూడా చేసుకోబోతున్నాడు యంగ్ హీరో. ఇక  ఈ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాని శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా