హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళు రాజకీయాల్లో..: ఎస్పీబీ ఆవేదన

Published : Jan 29, 2019, 07:50 PM ISTUpdated : Jan 29, 2019, 07:54 PM IST
హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళు రాజకీయాల్లో..: ఎస్పీబీ ఆవేదన

సారాంశం

ప్రముఖ గాయకులూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చాలా కాలం తరువాత ఎవరు ఊహించని ప్రసంగంతో పలు సామజిక అంశాల గురించి వివరించారు.

ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చాలా కాలం తరువాత ఎవరు ఊహించని ప్రసంగంతో పలు సామజిక అంశాల గురించి వివరించారు. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో జరిగిన హరికథ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న బాలు పలు విషయాల గురించి చెబుతూ ప్రస్తుతం ప్రపంచ పోకడను చూసి ఆవేదన కలుగుతోందని అన్నారు. 

హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళు మంత్రులుగా ఉండటం దౌర్బాగ్యం అని చెబుతూ.. ఈవెంట్స్ కి వచ్చే హీరోయిన్స్ వేషధారణపై కూడా బాలుగారు స్పందించారు. వేదికపైకి వచ్చే వారికి ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలో తెలియదు. అలాంటి అమాయకులు ఉన్నారంటూ అలా కురచ దుస్తుల్లో అక్కడ ప్రదర్శన ఇస్తేనే ఎదురుగా ఉన్న దర్శకులు నిర్మాతలు అవకాశాలు ఇస్తారు అనుకుంటున్నారో ఏమో అర్ధం కావడం లేదు. అలాంటి స్థాయికి సంస్కృతి దిగజారిపోయిందని యువత కొన్ని విషయాల గురించి ఆలోచించాలని అన్నారు. 

ప్రస్తుతం నేటి యువత సెల్ఫీ అంటూ ప్రముఖులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆధునిక సమాజంలో సంస్కృతులు సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని. నాకు ఇష్టం లేనివి రెండు.. సెల్ఫీలు ఫ్లెక్సీలు అంటూ ఎవరుపడితే వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రతి విషయాన్నీ ఫ్లెక్సీ లలో వేసుకోవడం అలవాటుగా మారిందని ఇది కూడా మంచి పద్ధతి కాదని ప్రతి దానికి కొన్ని పరిమితులు ఉంటాయని పలు ఉదాహరణలను వివరించారు.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?