వరుణ్ తేజ్ వాల్మీకి.. సంఘాల వార్నింగ్!

Published : Jan 29, 2019, 04:31 PM IST
వరుణ్ తేజ్ వాల్మీకి.. సంఘాల వార్నింగ్!

సారాంశం

రీసెంట్ గా మొదలైన వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి  అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ను వాల్మీకి వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు.

రీసెంట్ గా మొదలైన వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి  అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ను వాల్మీకి వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సినిమాకు స్టార్టింగ్ లోనే అంతరాయాలు ఏర్పడ్డాయి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సినిమాకు సంబందించిన టైటిల్ లోగోపై రివాల్వర్ ఉండడంతో వాల్మీకి పేరుకు ఒక రివాల్వాన్ని యాడ్ చేయడం తమ వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని వాల్మీకి సంఘం అధినేత సాయి ప్రసాద్ తెలియజేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన వెంటనే సినిమా టైటిల్ ను మర్చి తమ మనో భావాలను దెబ్బ తీసినందుకు చిత్ర యూనిట్ క్షమాపణ చెప్పాలని అన్నారు. 

టైటిల్ పై రివాల్వర్ ఉండడం తమ సామజిక వర్గాన్ని అవమానించడమే అని చెబుతూ.. వెంటనే వాల్మీకి టైటిల్ ను మార్చాలని లేదంటే సినిమా షూటింగ్ ను అడ్డుకుంటామని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు హెచ్చరించారు వాల్మీకి పేరుపై భక్తిరస ఆత్యాద్మిక సినిమాలు చేస్తే తమకు అభ్యంతరం లేదని కానీ వినోదం పేరుతో తమ సామజిక వర్గం పేరును కించేపరిచేలా వాడుకుంటే సహించేది లేదని అన్నారు. ఈ వివాదంపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?