`కీడాకోలా`లో ఎస్పీ వాయిస్‌.. తరుణ్‌ భాస్కర్‌పై ఎస్పీ చరణ్‌ లీగల్‌ యాక్షన్

By Aithagoni Raju  |  First Published Feb 21, 2024, 1:19 PM IST

దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వివాదంలో ఇరుక్కున్నాడు. `కీడా కోలా ` సినిమా విషయంలో ఆయన వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం. దీనిపై ఎస్పీ చరణ్‌ లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు.


దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన `కీడాకోలా` మూవీ గతేడాది విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇందులోని కామెడీ బాగా అలరించింది. మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీగా నిలిచింది. తాజాగా ఈ మూవీ వివాదంలో ఇరుక్కుంది. గాన గాంథర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్‌ ఈ మూవీ విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు సినిమాపై, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌పై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నాడు.

మరి ఇంతకి ఏం జరిగిందంటే.. తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన `కీడా కోలా` మూవీలో ఓ సన్నివేశంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్‌ని వాడుకున్నారు. ఏఐ ద్వారా క్రియేట్‌ చేసి ఆయన వాయిస్‌ని సినిమాలో ఉపయోగించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడిగా సృష్టించిన సంచలనాలు ఎలాంటివో తెలిసిందే. ఆయన వాయిస్‌కి అంతటి పవర్‌ ఉంది. అదే సమయంలో పేటెంట్‌ హక్కులు కూడా ఉంటాయి. 

Latest Videos

ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్‌ని వాడుకోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తను  క్షమాపణలు కోరుతున్నారు. అంతేకాదు దీనిపై ఆయన లీగల్‌ యాక్షన్‌ కి కూడా రెడీ అయ్యారు. సుమారు రూ.కోటీ వరకు పరిహారాన్ని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు రాయల్టీ షేర్‌ కూడా అడుగుతుండటం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఇది రాను రాను మరింతగా ముదురుతుంది.

మరి దీనిపై దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. పరిహారాన్ని చెల్లిస్తారా? లీగల్‌గా ప్రొసీడ్‌ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సినిమా విడుదలై ఇన్నాళ్లకి ఎస్పీ చరణ్‌ రియాక్ట్ కావడం ఆశ్చర్యంగా మారింది. ఇక ఎస్పీ చరణ్‌ గాయకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈటీవీలో పాటల ప్రోగ్రామ్‌(పాడుతా తీయగా)కి యాంకర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

Read more: చిరంజీవి నాకు ఎలాంటి సాయం చేయలేదు.. నటి లయ షాకింగ్‌ కామెంట్స్‌.. పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
 

click me!