అజిత్ మోసంచేశాడు... స్టార్ హీరో బండారం బయటపెట్టిన సినియర్ నిర్మాత...

Published : Feb 21, 2024, 12:53 PM IST
అజిత్ మోసంచేశాడు... స్టార్ హీరో బండారం బయటపెట్టిన సినియర్ నిర్మాత...

సారాంశం

తమిళ స్టార్ హీరో అజిత్ అసలు బండారం బయట పెట్టాడు సౌత్ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు. అజిత్  తనను ఎంత ఇబ్బందిపెట్టాడో వెల్లడిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు.   

ఈ తరం వారికి తెలుసో లేదో కాని.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు అట్లూరి పూర్ణచంద్రరావు. ఆయన సినిమా చేయని భషలేదు. దశాబ్దాల పాటు చిత్రపరిశ్రమలో కొనసాగిన నిర్మాత. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .  హిందీ భాషల్లో ఆయన బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. చాలా కాలంగా ఇంటికే పరిమితం అయిన పూర్ణచంద్రరావు.. తాజాగా ఓమీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో షాకింగ్ కామెంట్స్ చేశారు. 

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  హీరో అజిత్ నుంచి తనకి ఎదురైన అనుభవాన్ని గురించి గుర్తుచేసుకున్నారు.  అజిత్ ను హీరోగా పరిచయం చేసింది తానే అని చెప్పిన పూర్ణచంద్రరావు.. అజిత్ మొదటి సినిమా పెళ్లి పుస్తకం తానే నిర్మించానన్నారు. ఆతరువాత తమిళంలో హీరోగా స్టార్ అయిన అజిత్ లో చాలా మార్పు వచ్చిందన్నారు. అజిత్ హీరోగా స్టార్ డమ్ అందుకున్న టైమ్ లో పూర్ణ చంద్రరావు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు.  

ఆయన మాట్లాడుతూ..ఆ సమయంలో నేను విజయ్ .. విక్రమ్ ల తోను సినిమాలు నిర్మించాను. అలాగే అజిత్ తో కూడా  ఒక సినిమా చేయాలని అనుకుని అడిగాను.  కాని అప్పటికే స్టార్ గా వెలుగు వెలుగుతున్న అజిత్ ఊహించని పారితోషికం అడిగాడు. అయినాసరే సినిమా చేయాలన్న పట్టుదలతో సింగిల్ పేమెంట్ లో అంతా ఇచ్చేశాను.. కాని అతను మాత్రం సినిమా చేయకుండా తన చుట్టు తిప్పించుకుని ఇబ్బందిపెట్టాడంటూ.. షాకింగ్ విషయాలు బయట పెట్టాడు సీనియర్ నిర్మాత. ఎప్పటికప్పుడు రోజులు పొడిగిస్తూ వెళ్లాడు అని అన్నారు. 

అంతే కాదు.. నేను అన్ని భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేశాను.. వారెవరు ఇలా చేయలేదు. హిందీలో నేను అమితాబ్ తో సినిమాలు చేశాను ... తమిళంలో రజనీకాంత్ గతో 9 సినిమాలు నిర్మించాను. అయినా వాళ్ల చుట్టూ కూడా నేను ఎప్పుడూ అన్నిసార్లు తిరగలేదు. వారు చాలా బాగా సినిమాలు చేశారు. ఇబ్బంది పెట్టలేదు. కాని అజిత్ మాత్రం బాగా తిప్పించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పు నాకు అజిత్ వల్లనే అర్థమైంది. దాంతో నేను నా డబ్బు వెనక్కి తీసుకున్నాను. ఇంకోసారి అజిత్ సినిమా చేయలేదు అన్నారు అట్లూరి. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌