మెగాస్టార్ బర్త్‌డేకి స్పెషల్ విషెస్‌.. క్రియేటివ్‌ టచ్‌ ఇచ్చిన అల్లు శిరీష్

Published : Aug 22, 2020, 06:10 PM IST
మెగాస్టార్ బర్త్‌డేకి స్పెషల్ విషెస్‌.. క్రియేటివ్‌ టచ్‌ ఇచ్చిన అల్లు శిరీష్

సారాంశం

తన డెనిమ్‌ జాకెట్ మీద చిరంజీవి ఫోటోను ప్రింట్ చేయించుకున్న శిరీష్, ఆ జాకెట్ను ధరించి హై వే మీద స్టిల్ ఇచ్చాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాస్టార్‌కు బర్త్ విషెస్‌ చెప్పాడు శిరీష్. అయితే రొటీన్‌కు భిన్నంగా అల్లు శిరీష్ చేసిన ప్రయత్నానికి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. కరోన కారణంగా బహిరంగ వేడుకలకు అవకాశం లేకపోవటంతోఅ అభిమానులు సోషల్‌ మీడియాలో తమదైన స్టైల్‌లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అయితే గ్యాప్‌ లేకుండా ఒక్కో అప్‌డేట్‌తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మెగా హీరో ఒక్కొక్కరు ఒక్కోరకంగా విషెస్‌ తెలియజేయగా అల్లు శిరీష్ తన విషెస్‌ క్రియేట్‌ టచ్‌ ఇచ్చాడు.

తన డెనిమ్‌ జాకెట్ మీద చిరంజీవి ఫోటోను ప్రింట్ చేయించుకున్న శిరీష్, ఆ జాకెట్ను ధరించి హై వే మీద స్టిల్ ఇచ్చాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాస్టార్‌కు బర్త్ విషెస్‌ చెప్పాడు శిరీష్. అయితే రొటీన్‌కు భిన్నంగా అల్లు శిరీష్ చేసిన ప్రయత్నానికి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.  ఈరోజు ఉదయాన్నే అల్లు అర్జున్‌ అందరికన్నా ముందు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మెగాస్టార్‌ తదుపరి చిత్రం ఆచార్య ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా కాలం తరువాత ఈ సినిమాతో మెగాస్టార్‌ చిరంజీవి, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్‌ రిపీట్ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు