ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ సీరియస్

Published : Sep 24, 2020, 05:58 PM ISTUpdated : Sep 24, 2020, 06:09 PM IST
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ సీరియస్

సారాంశం

ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉందని సమాచారం.

ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించినట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆయనకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుందన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఎంజీఎం ఆస్పత్రి ఏ విధమైన బులిటెన్ విడుదల చేయలేదు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ బాలు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. రోజు రోజుకు మరింత మెరుగుపడుతుందని చెప్పారు. కానీ ఇంతలో మరోసారి ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. పరిస్థితి కాస్త విషమంగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. 

కరోనా కారణంగా గత నెల మొదటి వారంలో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. గత 40 రోజులుగా ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం మరింత విషమించిందన్నారు. ఐసీయూలో, వెంటిలేషన్‌పై, ఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఎంతో పోరాటంతో ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నుంచి నెగటివ్‌ పొందినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆరోగ్యం విషమించిందనే వార్తతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Heroes Rare Pic: ఒకే స్టేజ్‌పై కృష్ణ, చిరు, నాగ్‌, వెంకీ, రాజశేఖర్‌, రమ్యకృష్ణ.. ఇది కదా కావాల్సింది, ఫోటో వెనుక స్టోరీ
ఆలియా భట్ యాక్షన్ సినిమా ఓటీటీలో రిలీజ్.. అసలేం జరుగుతోంది ?