
క్రాక్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజకు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల రూపంలో పరాజయాలు ఎదురయ్యాయి. క్రాక్ సక్సెస్ ని ఎంజాయ్ చేయకుండా చేశాయి. అయితే మూడో మూవీతో ఆయనకు విజయం దక్కింది. దర్శకుడు త్రినాథరావు నక్కిన తన గత చిత్రాలకు భిన్నంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. 2022 చివర్లో విడుదలైన ధమాకా బాక్సాఫీస్ వద్ద పటాసులా పేలింది. చిత్ర విజయంలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది.
ఈ వయసులో రవితేజకు జంటగా శ్రీలీల? అని మొదట్లో కొందరు పెదవి విరిచారు. వీరి కాంబో సెట్ కాదనుకున్నారు. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ రవితేజ-శ్రీలీల సిల్వర్ స్క్రీన్ మీద అదరగొట్టారు. వారి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ పంచింది. కాగా ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం.
దర్శకుడు గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రవితేజతో చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ చర్చలు కూడా ముగియగా కాస్టింగ్ స్టార్ట్ చేశారట. హీరోయిన్ గా శ్రీలీలను అనుకుంటున్నారట. దాదాపు ఈ యంగ్ బ్యూటీని ఖాయం చేశారంటున్నారు. అదే జరిగితే రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ శ్రీలీల తెలుగులో అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని, నితిన్, వైష్ణవ్ తేజ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా ఉన్నారు. రవితేజ మూవీ మరో క్రేజీ ప్రాజెక్ట్ గా ఆమె ఖాతాలో చేరనుంది.