ఆస్కార్ బరిలో సూర్య సూరారై పోట్రు!

Published : Jan 27, 2021, 02:44 PM IST
ఆస్కార్ బరిలో సూర్య సూరారై పోట్రు!

సారాంశం

2021 ఆస్కార్ నామినేషన్స్ కి గాను సూరారై పోట్రు ఎంపికైనట్లు ఆ చిత్ర సహనిర్మాత తెలియజేశారు. బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, ఒరిజినల్ స్కోర్ విభాగాలలో  పోటీపడనున్న సురారై పోట్రు, నేడు అకాడమీ సభ్యుల పరిశీలను వెళ్లనుందని ఆయన ట్వీట్ చేశారు.   

2020లో ఓటిటి లో విడుదలైన చిత్రాలలో సురారై పోట్రు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సూరారై పోట్రు బెస్ట్ మూవీగా విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంది. హీరో సూర్య అద్భుత నటన, డైరెక్టర్ సుధా కొంగర టేకింగ్ మూవీని పతాక స్థాయికి చేర్చాయి.  అమెజాన్ ప్రైమ్ లో సూరారై పోట్రు విడుదల కావడం జరిగింది. 
ఇక తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో ఈ మూవీ విడుదలైంది. తెలుగులో కూడా సూరారై పోట్రు హిట్ టాక్ అందుకుంది. 

కాగా ఈ మూవీకి అరుదైన గౌరవం దక్కించుకుంది. 2021 ఆస్కార్ నామినేషన్స్ కి గాను సూరారై పోట్రు ఎంపికైనట్లు ఆ చిత్ర సహనిర్మాత తెలియజేశారు. బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, ఒరిజినల్ స్కోర్ విభాగాలలో  పోటీపడనున్న సురారై పోట్రు, నేడు అకాడమీ సభ్యుల పరిశీలను వెళ్లనుందని ఆయన ట్వీట్ చేశారు. 

సాంకేతికంగా, టేకింగ్ మరియు కాన్సెప్ట్ పరంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిన సూరారై పోట్రు ఆస్కార్ బరిలో నిలిచి సత్తా చాటుతుందేమో చూడాలి. ఇక త్వరలో బిగ్ స్క్రీన్ పై కూడా సూరారై పోట్రు విడుదల కానుంది. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అలాగే విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ మూవీలో ఓ కీలక రోల్ చేయడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌