ఆచార్య టీజర్ లోని సర్ప్రైజ్ లీక్ చేసిన వరుణ్ తేజ్!

Published : Jan 27, 2021, 12:35 PM ISTUpdated : Jan 27, 2021, 12:38 PM IST
ఆచార్య టీజర్ లోని సర్ప్రైజ్ లీక్ చేసిన వరుణ్ తేజ్!

సారాంశం

ఆచార్య టీజర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వరుణ్ తేజ్ లీక్ చేశాడు. ఆచార్య టీజర్ పై వరుణ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బ్రహ్మానందం ఫొటోతో కూడిన మీమ్ ని వరుణ్ పంచుకోవడంతో పాటు కీలక విషయం బయటపెట్టారు.   

మెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు దర్శకుడు కొరటాల శివ. జనవరి 29న ఆచార్య టీజర్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య మూవీపై స్కై హై అంచనాలున్న నేపథ్యంలో, మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య టీజర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వరుణ్ తేజ్ లీక్ చేశాడు. ఆచార్య టీజర్ పై వరుణ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బ్రహ్మానందం ఫొటోతో కూడిన మీమ్ ని వరుణ్ పంచుకోవడంతో పాటు కీలక విషయం బయటపెట్టారు. 

'ఆచార్య టీజర్ లో చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా... ఆహ్ బయట టాకు' అంటూ ఓ మీమ్ తో కూడిన ఫోటోని వరుణ్ ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ కి చెందిన హీరో ట్వీట్ నేపథ్యంలో ఇది నమ్మదగిన విషయమే అని అందరూ ఫిక్స్ అయ్యారు. చిరంజీవి గత చిత్రం సైరా ట్రైలర్ కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. లేటెస్ట్ ఆచార్య మూవీ టీజర్ కి చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా విశేషమే అవుతుంది.  మరోవైపు చరణ్ ఆచార్య మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. 

సమ్మర్ కానుకగా ఆచార్య విడుదల కానుండగా దేవాలయాలు, వారసత్వ సంపద అనే సామాజిక అంశం ఆధారంగా, కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఆచార్య మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో సంయుక్తంగా ఆచార్య తెరకెక్కుతుంది. ఇక ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌