బీఎంసీ ఆరోపణలు: పవార్‌తో సోనూసూద్ భేటీ.. పొలిటికల్ సపోర్ట్ కోసమేనా..?

Siva Kodati |  
Published : Jan 13, 2021, 04:35 PM IST
బీఎంసీ ఆరోపణలు: పవార్‌తో సోనూసూద్ భేటీ.. పొలిటికల్ సపోర్ట్ కోసమేనా..?

సారాంశం

ప్రముఖ సినీనటుడు, రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ బుధవారం నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు.  ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లిన సోనూ ఆయన్ను కలిశారు. పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు.

ప్రముఖ సినీనటుడు, రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ బుధవారం నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు.  ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లిన సోనూ ఆయన్ను కలిశారు. పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు.

అయితే శరద్ పవార్‌ను సోనూసూద్ ఎందుకు కలిశాడన్న దానిపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. కాదు కాదు.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ తనపై చేసిన ఆరోపణల గురించి చెప్పడానికంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కేవలం మర్యాదపూర్వకంగానే శరద్ పవార్‌ను సోనూ సూద్ కలిసినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.

ఇటీవల బృహన్ ముంబై కార్పొరేషన్ సోనూ సూద్‌పై పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. జుహూ ప్రాంతలో ఉన్న తన ఆరంతస్తుల భవాన్ని ఆయన ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని బీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:సోనూ సూద్‌ అలవాటు పడ్డ నేరస్తుడుః బీఎంసీ సంచలన వ్యాఖ్యలు

చట్టాన్ని ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అంతేకాదు ఆయన పాత నేరస్తుడని.. నేరాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే బీఎంసీ ఆరోపణలను సోనుసూద్ తీవ్రంగా ఖండించారు. తన రెసిడెన్షియల్ బిల్డింగ్‌ని హోటల్‌గా మార్చేందుకు బీఎంసీ నుంచి 'చేంజ్ ఆఫ్ యూజర్' అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశారు.

ఇలాంటి పరిస్ధితుల్లో సోనూసూద్ శరద్ పవార్‌ని కలవడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర రాజకీయాలను ఒంటిచేత్తో నడిపిస్తున్న వ్యక్తి శరద్ పవార్. అటు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు పాలనాపరంగా ఏవైనా ఇబ్బందులు వస్తే పవార్‌నే సంప్రదిస్తారు. మిగితా ప్రముఖులూ పవార్‌నే సంప్రదిస్తారు. ఈ కారణంగానే సోనూసూద్ కూడా పవార్‌తో భేటీ అయ్యారని తెలుస్తోంది

PREV
click me!

Recommended Stories

Arijit Singh: స్టార్‌ సింగర్‌ అరిజిత్‌ సింగ్‌ సంచలన ప్రకటన.. ఇకపై పాటలకు గుడ్‌ బై.. కానీ ట్విస్ట్ ఏంటంటే
Tharun Bhaskar: ఈ రెండేళ్లు ఆమెనే సర్వస్వం.. ఈషా రెబ్బాతో పెళ్లిపై తరుణ్‌ స్టేట్‌మెంట్‌.. త్వరలో ప్రకటన