Sonali Bendre: ఎన్టీఆర్ మూవీపై సోనాలి బింద్రే రియాక్షన్.. ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ..

Published : May 31, 2022, 07:34 AM IST
Sonali Bendre: ఎన్టీఆర్ మూవీపై సోనాలి బింద్రే రియాక్షన్.. ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ..

సారాంశం

ఆర్ఆర్ఆర్ బ్లాస్టింగ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ చిత్రానికి ప్రకటన కూడా వచ్చింది.

ఆర్ఆర్ఆర్ బ్లాస్టింగ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ చిత్రానికి ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు నటీనటుల ఎంపిక, లొకేషన్స్ లాంటి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నట్లు అనౌన్సమెంట్ వీడియోతోనే క్లారిటీ ఇచ్చేశారు. 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ విషయంలో ఎంతకీ క్లారిటీ రావడం లేదు. అలియా భట్, సాయి పల్లవి, జాన్వీ కపూర్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే నటించబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 

ఎన్టీఆర్ చిత్రంతో సోనాలి బింద్రే తిరిగి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ పై సోనాలి బింద్రే తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ చిత్రంలో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె షాక్ అయ్యారు. సోనాలి మాట్లాడుతూ.. నో.. నాకు దీని గురించి అసలు తెలియదు.. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది ఫేక్ న్యూస్ అంటూ సోనాలి బింద్రే క్లారిటీ ఇచ్చింది. దీని గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు అని సోనాలి బింద్రే తెలిపింది. 

సో ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు. సోనాలి బింద్రే టాలీవుడ్ లో గోల్డెన్ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె నటించిన ఎక్కువ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మురారి, ఇంద్ర, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. పలనాటి బ్రహ్మనాయుడు చిత్రం మాత్రం నిరాశపరిచింది. ఆ మధ్యన క్యాన్సర్ కి గురైన సోనాలి బింద్రే ఫారెన్ లో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా