
టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించిన సోనాలి బింద్రే బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. నీఊయార్క్ లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు తన కుమారుడు రణవీర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 13వ ఏట అడుగుపెడుతున్న తన కొడుకుని పొగుడుతూ ఈ సమయంలో అతడితో లేనందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
'రణవీర్.. మై సన్, మై మూన్, మై స్టార్స్, మై స్కై.. నువ్వు 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. నువ్ ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చేశావ్. ఇది నమ్మడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. నిన్ను చూసి నేను ఎంతగా గర్వపడతానో నీకు చెప్పలేను. హ్యాపీ బర్త్ డే.. తొలిసారి ఈ సమయంలో మనమిద్దరం కలిసి లేము. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ పోస్ట్ పెట్టింది.
రణవీర్ ఫొటోలతో రూపొందించిన ఓ వీడియోను షేర్ చేసింది. సోనాలి పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె తొందరగా కోలుకోవాలని మెసేజ్ లు పెడుతున్నారు.