దిల్ రాజు కాదంటే.. అక్కడ తేలాడు!

Published : Aug 11, 2018, 12:55 PM ISTUpdated : Sep 09, 2018, 12:18 PM IST
దిల్ రాజు కాదంటే.. అక్కడ తేలాడు!

సారాంశం

'వన్ నేనొక్కడినే', 'ఆగడు' వంటి సినిమాలు నిర్మించిన గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు కలిసి హరీష్ శంకర్ తో ఓ సినిమాను నిర్మించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం కథకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది

దిల్ రాజు కాంపౌండ్ లో సినిమాలు చేసిన దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేయాలనుకున్నాడు. దానికి 'దాగుడుమూతలు' అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేశారు. ఇద్దరు యంగ్ హీరోలతో ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. హరీష్ చెప్పిన కథ సంతృప్తిగా అనిపించకపోవడంతో దిల్ రాజు ఈ సినిమాను పక్కన పెట్టినట్లు వెల్లడించారు.

దీంతో ఇక దిల్ రాజు కాంపౌండ్ లో కష్టమని భావించిన హరీష్ శంకర్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లో తేలాడు. 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' వంటి సినిమాలు నిర్మించిన గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు కలిసి హరీష్ శంకర్ తో ఓ సినిమాను నిర్మించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం కథకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ ముగ్గురు నిర్మాతల మధ్య సఖ్యత చెడిందని, అనీల్ సుంకర ఆ కారణంగానే ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిన్న సినిమాలు నిర్మిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

మరి హరీష్ శంకర్ సినిమాను ముగ్గురు కలిసి నిర్మిస్తారో లేక ఆచంట బ్రదర్స్ నిర్మిస్తారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. కానీ ఈ బ్యానర్ లో హరీష్ సినిమా అయితే ఖాయమని సమాచారం! 

PREV
click me!

Recommended Stories

టాక్సిక్ లో బోల్డ్ సీన్, ఈ సినిమాకి ఆమె దర్శకురాలు అంటే నమ్మలేకపోతున్నా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..