పెళ్లైనా సోనాలిని ప్రేమిస్తూనే ఉన్న పొలిటీషియన్‌ ఎవరో తెలుసా? 30 ఏళ్ల తర్వాత కలిసి సైగలు.. వీడియో వైరల్

Published : Mar 05, 2025, 08:50 PM ISTUpdated : Mar 05, 2025, 08:54 PM IST
పెళ్లైనా సోనాలిని ప్రేమిస్తూనే ఉన్న పొలిటీషియన్‌ ఎవరో తెలుసా? 30 ఏళ్ల తర్వాత కలిసి సైగలు.. వీడియో వైరల్

సారాంశం

ఒకప్పుడు రిలేషన్​లో ఉన్న నటి సోనాలి బెంద్రే, రాజకీయ నాయకుడు రాజ్​ థాకరే 30 ఏళ్ల తర్వాత కలిశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సోనాలి చేసిన పని రచ్చ అవుతుంది. 

మొదటి ప్రేమను ఎవరూ మర్చిపోలేరు అంటారు. ఆ మాట బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే, రాజకీయ నాయకుడు రాజ్ థాకరే విషయంలో నిజమైంది. వీళ్లిద్దరూ కలిసింది 30 ఏళ్ల తర్వాత! వీళ్లిద్దరూ ఒకప్పుడు ప్రేమికులు అనే విషయం చాలా మందికి తెలీదు. మహారాష్ట్రలో జరిగిన మరాఠీ భాషా దినోత్సవం రోజున వీళ్లిద్దరూ కలిశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మాజీ ప్రియుడు రాజ్‌ థాకరేని రమ్మంటూ సోనాలి బింద్రే సైగలు..

ఆ వీడియోలో సోనాలి బెంద్రే తన కళ్లతో రాజ్ థాకరేను తనతో రమ్మన్నట్లుగా సైగ చేసింది. అయితే దీని వెనుక ఒక కథ ఉంది. సోనాలి బింద్రే హీరోయిన్‌గా రాణించే సమయంలో  రాజ్ పెళ్లయినా ఆమెని ప్రేమించేవాడు. సోనాలి కూడా రాజ్‌ను ప్రేమించింది. కానీ వాళ్లిద్దరూ ఒక్కటి కాలేకపోయారు. చాలా మీడియా కథనాల ప్రకారం సోనాలి బెంద్రే, రాజ్ థాకరే ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకున్నారు.

సోనాలి బింద్రే, రాజ్‌ థాకరే ప్రేమని వ్యతిరేకించిన బాల్‌ థాకరే..

బాలీవుడ్‌లో సోనాలి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లినది రాజే. కానీ వాళ్ల బాబాయి బాల్ థాకరేకు ఈ విషయం తెలిసినప్పుడు ఈ సంబంధాన్ని ఆయన వ్యతిరేకించారు. సోనాలికి దూరంగా ఉండమని చెప్పారు. రాజ్ థాకరే సోనాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు బాల్ థాకరే వద్దని సలహా ఇచ్చారు. ఎందుకంటే అది ఆయన రాజకీయ జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాదు రాజ్ అప్పటికే షర్మిలా థాకరేను పెళ్లి చేసుకున్నాడు.

సోనాలితో ప్రేమలో ఉన్న నాటికి రాజ్‌ థాకరేకి మ్యారేజ్‌

రాజ్ తన రాజకీయ జీవితం కోసం ఈ సంబంధాన్ని తెంచుకున్నాడు. ఇదిలా ఉంటే సోనాలి బెంద్రే మరాఠీ భాషా కార్యక్రమంలోని కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలతో పాటు "మరాఠీ ప్రపంచంలోని గొప్ప వ్యక్తులతో ఈ ప్రత్యేక క్షణాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు రాజ్ థాకరేకు ధన్యవాదాలు" అని రాసింది. ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరాఠీ సాహిత్యంలో పాల్గొనడానికి ఇది మంచి అవకాశం. మరాఠీ పుస్తక ప్రదర్శనకు వెళ్లి మీ భాష యొక్క గొప్పతనాన్ని అనుభవించండి అని చెప్పింది. ప్రస్తుతం ఆమె పోస్ట్, అలాగే ఇందులో రాజ్‌ని రమ్మంటూ ఆమె సైగలు చేసిన తీరు చాలా రొమాంటిక్‌గా ఉంది. ఇదే ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నెటిజన్లు పెద్ద రచ్చ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్