రిలీజ్‌ అయిన రెండేళ్లకి ఓటీటీలో అఖిల్‌ మూవీ.. మమ్ముట్టి నటించిన సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Published : Mar 05, 2025, 07:02 PM IST
రిలీజ్‌ అయిన రెండేళ్లకి ఓటీటీలో అఖిల్‌ మూవీ.. మమ్ముట్టి నటించిన సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

సారాంశం

Akhil-agent: అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన చివరి మూవీ `ఏజెంట్‌` రెండేళ్ల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.   

Akhil-agent: అక్కినేని అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లే అవుతుంది. కానీ ఇప్పటి వరకు సరైన బ్రేక్‌ రాలేదు. ఇంకా హీరోగా స్ర్టగుల్‌ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్‌తో పవర్‌ఫుల్‌ మూవీతో రాబోతున్నాడట.

అయితే అఖిల్‌ చివరగా `ఏజెంట్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సురేందర్‌ రెడ్డి రూపొందించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ రెండేళ్ల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 

అఖిల్‌ `ఏజెంట్‌` మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌..

2023 ఏప్రిల్‌లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. థియేటర్లలో నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. డిజాస్టర్‌ ఫలితాన్ని చవి చూసింది. అయితే సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఓటీటీలో రాలేదు. తాజాగా సోనీ లివ్‌ ఓటీటీ రైట్స్ ని దక్కించుకుంది.

త్వరలోనే ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సడెన్‌ సర్‌ప్రైజ్‌ ని ఇవ్వబోతుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇష్టపడే ఆడియెన్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతుంది. ఈ మూవీ మార్చి 14 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ విషయాన్ని సోనీ లివ్‌ నిర్వాహకులు వెల్లడించారు. 

గూఢచారి యాక్షన్‌ థ్రిల్లర్‌గా అఖిల్‌ `ఏజెంట్‌`.. స్టోరీ ఏంటంటే?

`గూఢ‌చారి థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను అభిమానించే ప్రేక్ష‌కులు ఇప్పుడు హై యాక్ష‌న్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవ‌టానికి సిద్ధం కావాలని వారు వెల్లడించారు. రికీ అనే టాలెంటెడ్‌ రా ఏజెంట్‌కు ఓ క్లిష్ట‌మైన మిష‌న్‌ను పూర్తి చేయాల్సిన బాధ్య‌త‌ను అప్ప‌గిస్తారు. ది డెవిల్ అనే పిల‌వ‌బ‌డే రా చీఫ్ క‌ల్న‌ల్ మ‌హాదేవ్ ఈ ప‌నిని రికీకి అప్ప‌గిస్తాడు.

ఈ క్ర‌మంలో రికీ ర‌హస్యంగా ఈ ప‌నిని పూర్తి చేసే ప‌నిలో ఉంటాడు. మ‌రో వైపు ధ‌ర్మ అలియాస్ గాడ్ అనే మాజీ రా ఏజెంట్ భార‌తదేశాన్ని నాశ‌నం చేయ‌టానికి ప‌థ‌కం వేస్తాడు. మిష‌న్ అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరం. 

అక్కినేని, మమ్ముట్టి నటించిన `ఏజెంట్‌` మూవీ టీమ్‌

థియేటర్లలో ఈ మూవీ అంతగా ఆదరణ పొందలేదు. కానీ ఓటీటీలో చూడదగ్గ సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందులో అఖిల్ అక్కినేని, మ‌మ్ముట్టితోపాటు డినో మోరియా, సాక్షి వైద్య‌, డెంజిల్ స్మిత్‌, విక్ర‌మ్‌జీత్ విర్క్ త‌దిత‌రులు న‌టించారు. వీరు త‌మ న‌ట‌న‌తో సినిమాను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ అందించిన క‌థ‌కు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లేను కూడా ర‌చించారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేంద‌ర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర‌, అజ‌య్ సుంక‌ర‌, ప‌తి దీపా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట్రికల్‌గా నిరాశ పరిచిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కొంటుందో చూడాలి. 

read more: తల్లి రోజా రమణి వల్లే తరుణ్‌ కెరీర్‌ డౌన్‌ అయ్యిందా? లవర్‌ బాయ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

also read: ఉదయ్‌ కిరణ్‌ మోకాళ్లు పట్టుకుని ఏడ్చాడు, లాగిపెట్టి కొట్టేదాన్ని.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సీనియర్‌ నటి
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు