
ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున వరస ప్రాజెక్టు లో బిజి అవుతున్నారు. ముఖ్యంగా మూలనపెట్టిన బంగార్రాజు ని బయిటకు తీసారు. సూపర్ హిట్ సోగ్గాడే చిన్నినాయన సినిమా ప్రీక్వెల్ గా బంగార్రాజు రెడీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట నాగ్. కరోనా గ్యాప్ లో ఈ సినిమాకు సంభందించిన పనులు చేస్తున్నాడట దర్శకుడు . ఈ విషయం నాగ్ స్వయంగా చెప్పారు. నాగ్ మాట్లాడుతూ… ‘బంగార్రాజు’ కథనే సిద్ధం చేసుకుంటున్నాం.
దర్శకుడు కల్యాణ్ కృష్ణ తో ఆన్లైన్లో మాట్లాడుతూ కథ గురించి చర్చించుకుంటున్నాం. షూటింగ్ లు మొదలు కాగానే ఆ సినిమాని మొదలు పెట్టనున్నాం అని అన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హీరోయిన్ సెట్ అయ్యిందని సమాచారం. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా . ఆమెతో చిత్ర టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. సినిమా షూటింగ్ జులైలో ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి.
ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారట. సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇక నాగార్జున బంగార్రాజు సినిమా చేస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు.
ఈ మధ్యే విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమా ఓటీటీలోనూ వచ్చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమం పూర్తిచేసుకొంది. ఇక బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ‘బ్రహ్మస్ర్తా’లో విష్ణు పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సోనాక్షి ప్రస్తుతం శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో ‘బుల్‌బుల్ తరంగ్’అనే వెబ్‌సీరీస్‌లో నటించనుంది.