కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన సోనాక్షి సిన్హా.. ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ.. ఫ్యాన్స్ ఫూల్స్

Published : May 12, 2022, 07:03 PM IST
కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన సోనాక్షి సిన్హా.. ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ.. ఫ్యాన్స్ ఫూల్స్

సారాంశం

సోనాక్షి అభిమానుల్ని, నెటిజన్లని ఫూల్‌ని చేసింది. ఊరించి ఉసూరుమనిపించింది. లేటెస్ట్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయంపై స్పందించింది.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఆమె వేలికి డైమండ్‌ రింగ్‌ పెట్టుకున్న ఫోటోలను పంచుకుంది. పక్కన ఓ వ్యక్తిని పట్టుకుని ఉంది సోనాక్షి. దీంతో ఆ వ్యక్తితో సోనాక్షి నిశ్చితార్థం అయిపోయిందని అంతా అనుకున్నారు. పైగా తన జీవితంలో ఇదొక బిగ్‌ డే, తన డ్రీమ్‌ నెరవేరిన రోజు అంటూ పోస్ట్ కూడా పెట్టింది. దీంతో సోనాక్షి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని కన్ఫమ్‌ చేసుకున్నారు అభిమానులు. నెటిజన్లు ఏకంగా విషెస్‌లు కూడా తెలిపారు. ఈ వార్తలు బాలీవుడ్‌ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించింది సోనాక్షి. అభిమానుల్ని, నెటిజన్లని ఫూల్‌ని చేసింది. ఊరించి ఉసూరుమనిపించింది. లేటెస్ట్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయంపై స్పందించింది. తాను కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినట్టు చెప్పింది. దీనిపై వివరణ ఇచ్చింది. ` నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించానని అనుకుంటున్నా. నేను ఒక్క అబద్దం కూడా చెప్పకుండ మీకు ఎన్నో క్లూలు ఇచ్చాను. అవును నేను చెప్పినట్లుగా ఆ రోజు నాకు బిగ్‌డే.. ఎందుకంటే నా సొంత నెయిల్‌ పాలిష్‌ బ్రాండ్‌ సోయిజీని ప్రారంభించే రోజు నాకు గొప్ప రోజే. అందమైన నెయిల్స్‌ కోసం ప్రతి అమ్మాయికి ఇదే చివరి గమ్మం అవుతుంది. 

నేను బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నాళ్లుగా ఉన్నా నా పెద్ద కలని నిజం చేసుకున్నా. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నా. `సోయిజీ` నెయిల్‌ పాలిష్‌ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా ప్రేమను పంచుకున్న. మీరు ఏమనుకున్నారు? హాహ్హాహ్హా.. లవ్‌ యూ గాయ్స్‌! మీరు ఇచ్చిన సపోర్ట్‌కు ధన్యవాదాలు` అని పోస్ట్ పెట్టింది సోనాక్షి సిన్హా. దీంతో అసలు విషయం తెలిసి నెటిజన్లు ఆమెకి విషెస్‌ తెలియజేస్తున్నారు. కాంగ్రాస్ట్ చెబుతున్నారు. అయితే ఇలా కూడా ఫూల్‌ని చేస్తారా? అంతా తూచ్‌.. అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా సోనాక్షి నెయిల్‌ పాలిష్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిందని చెప్పొచ్చు. 

ఇక కెరీర్‌ పరంగా సోనాక్షి బిజీగానే ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు `కకుడా`, `డబుల్‌ ఎక్స్ ఎల్‌` చిత్రాల్లో నటిస్తుంది. చివరగా ఆమె `భూజ్‌ఃది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా` సినిమాలో మెరిసింది. అయితే ఆమెకి హీరోయిన్‌గా చాలా తక్కువగా సినిమాలొస్తున్నాయి. పైగా సోనాక్షి కూడా చాలా సెలక్టీవ్‌గానే ఉంటుంది. కమర్షియల్‌ పాత్రలకు దూరంగా మంచి బలమైన పాత్ర ఉన్న సినిమాలు చేస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ