యూస్ లో మహేష్ సర్కారు వారి పాటు సత్తా చాటుతుంది. ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మ్యాజిక్ ఫిగర్ కి చేరువైంది. యూస్ మార్కెట్ తన అడ్డా అని మహేష్ మరోసారి రుజువు చేశారు.
యూఎస్ లో మహేష్ రికార్డు ఎవరూ చెరపలేనిది. మహేష్ (Mahesh Babu)నటించిన 8 సినిమాలు వన్ మిలియన్ వసూళ్లు సాధించాయి. సర్కారు వారి పాట చిత్రంతో ఆయన మరో వన్ మిలియన్ మూవీ ఖాతాలో వేసుకోనున్నారు. కేవలం ప్రీమియర్స్ తోనే సర్కారు వారి పాట ఆ మ్యాజిక్ ఫిగర్ కి చేరువైంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం సర్కారు వారి పాట $9.1 లక్షల వసూళ్లను క్రాస్ చేసింది. ఇంకా కొన్ని ఏరియాల కలెక్షన్స్ రిపోర్ట్ అందాల్సి ఉండగా... $1 మిలియన్ కి చేరుకున్నట్లే అంటున్నారు. ఇక మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు $7.59 లక్షల ప్రీమియర్ వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఇది మహేష్ కి కొత్త రికార్డు.
మిక్స్డ్ టాక్ లో కూడా మహేష్ మూవీ ఈ రేంజ్ వసూళ్లు సాధించడం చెప్పుకోదగ్గ విషయం. ఇక హైదరాబాద్ సిటీలో సైతం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డు సొంతం చేసుకుంది. దాదాపు రూ . 9 కోట్ల వసూళ్లు సాధించింది. సినిమాపై ఉన్న హైప్ రీత్యా భారీగా బుకింగ్స్ నడిచిన నేపథ్యంలో ఫస్ట్ డే ఓపెనింగ్ ఫిగర్ సాలిడ్ గా ఉండే అవకాశం కలదు. కాగా ఫస్ట్ డే సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత ఉండనుందనేది చూడాలి.
USA premières Crossed $900K+ Gross 💰
🇺🇸 Release by , &Classics Ent's pic.twitter.com/mt9cqT5vJQ
దర్శకుడు పరశురామ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సముద్ర ఖని, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్, నదియా కీలక రోల్స్ చేయడం జరిగింది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సర్కారు వారి పాట చిత్రానికి సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్, జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ , 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.