అప్పుడు నా సినిమాకు 20మంది కూడా రాలేదు... కన్నీరు పెట్టుకున్న సోహైల్

Published : Dec 18, 2020, 12:24 AM IST
అప్పుడు నా సినిమాకు 20మంది కూడా రాలేదు... కన్నీరు పెట్టుకున్న సోహైల్

సారాంశం

హౌస్ నుండి బయటికి వెళ్ళాక తన సినిమా చూడడానికి లక్షల మంది వస్తారని సోహైల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై కథ వేరే ఉంటదని , బయటికి వచ్చాక సత్తా చూపిస్తానని సోహైల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. తనను ఇంత మందికి పరిచయం చేసిన బిగ్ బాస్ కి ధన్యవాదాలు తెలిపాడు.

 
మంచి మనసు కలిగిన, కల్మషం లేని వ్యక్తిగా సోహైల్ ని బిగ్ బాస్ వర్ణించాడు. అలాగే అనేక మంది ప్రేక్షకుల హృదయాలు గెలిచినట్లు తెలియజేశాడు బిగ్ బాస్. దీనితో హౌస్ నుండి బయటికి వెళ్ళాక తనకు మంచి భవిష్యత్తు ఉన్నట్లు సోహైల్ భావించారు. ఒకప్పుడు తాను నటించిన సినిమా విడుదలైతే థియేటర్ దగ్గర కనీసం 20మంది కూడా లేరట. తన సినిమాకు తానే టికెట్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితిని అప్పుడు చూశాడట సోహైల్. 
 
హౌస్ నుండి బయటికి వెళ్ళాక తన సినిమా చూడడానికి లక్షల మంది వస్తారని సోహైల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై కథ వేరే ఉంటదని , బయటికి వచ్చాక సత్తా చూపిస్తానని సోహైల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. తనను ఇంత మందికి పరిచయం చేసిన బిగ్ బాస్ కి ధన్యవాదాలు తెలిపాడు. తనకు బిగ్ బాస్ ఒక మార్గం చూపించాడని, దారి వేశాడని సంతోషపడ్డాడు. సోహైల్ కి బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ చెప్పగా... అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. 

PREV
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా