కిడ్నాప్, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ మోడల్ హస్తం!

By AN TeluguFirst Published Sep 6, 2019, 10:26 AM IST
Highlights

సోఫియా మీర్జా పాల్పడిన పలు నేరాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేపట్టింది. పాక్ దేశంలోని చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా వివాదాస్పదంగా పేరొందింది. కొంతకాలం క్రితం ఈమెపై మోసం, కిడ్నాప్ కేసులు కూడా నమోదయ్యాయి. 

పాకిస్థాన్ దేశానికి చెందిన మోడల్, సినీ నటి సోఫియా మీర్జాకు మనీలాండరింగ్, కిడ్నాప్ కేసుల్లో ప్రమేయం ఉందని పాక్ నేషనల్ అకౌంట్‌బులిటీ బ్యూరో (ఎన్ఎబీ) దర్యాప్తులో తేలింది. సోఫియా మీర్జా పాల్పడిన పలు నేరాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేపట్టింది.

పాక్ దేశంలోని చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా వివాదాస్పదంగా పేరొందింది. కొంతకాలం క్రితం ఈమెపై మోసం, కిడ్నాప్ కేసులు కూడా నమోదయ్యాయి. 'సుసార్ ఇన్ లా' నాటకంలో నటించిన సోఫియా పలు నాటకాలు, సీరియళ్లు, యాడ్స్ లో నటించారు.

అయితే తనపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన ఈమె అవి నిజాలు కాదని కొట్టిపారేసింది. కేవలం పుకార్లు మాత్రమేనని.. నార్వే దేశంలో నివాసం ఉంటున్న తన మాజీ భర్త కావాలని ఇలాంటి తప్పు ప్రచారం చేస్తున్నాడని ఆమె ఆరోపణలు చేస్తోంది.

ఇది ఇలా ఉండగా.. నాలుగేళ్ల క్రితం సోఫియా ఐదు లక్షల డాలర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అనుమతి లేకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానం ఎక్కగా.. ఇస్లామాబాద్ లోని షహీద్ బేనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. 

click me!