20 లక్షలు మీ అమ్మన కొనగలవేమో ఓ సారి అడిగి చూడు..సోఫియా హయత్

Published : Mar 12, 2018, 01:14 PM ISTUpdated : Mar 25, 2018, 05:27 PM IST
20 లక్షలు మీ అమ్మన కొనగలవేమో ఓ సారి అడిగి చూడు..సోఫియా హయత్

సారాంశం

సోషల్ మీడియాలోకి సెలబ్రిటీలు వచ్చిన తర్వాత అభిమానులకు వారిని చేరుకోవడం దగ్గరైంది. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా వాగేయడం ఎక్కువైపోయింది.  

సోషల్ మీడియాలోకి సెలబ్రిటీలు వచ్చిన తర్వాత అభిమానులకు వారిని చేరుకోవడం దగ్గరైంది. తమ తారల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. మరోవైపు ఆయా స్టార్స్ కు కూడా దీన్ని ఓ చక్కని సంపాదన మార్గంగా మలుచుకుంటున్నారు. కొందరు భారీగాను.. కొందరు కొన్ని ఖర్చుల వరకూ సంపాదించుకంటున్నారు. ఇంతవరకూ ఓకే అయినా.. నాణేనికి రెండో వైపు కూడా ఉంది. 

అదే ట్రాలింగ్.. వేధింపులు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా వాగేయడం ఎక్కువైపోయింది. ఈ తిట్ల బారిన పడని సెలబ్రిటీ ఒక్కరూ కూడా ఉండడం లేదు. కొందరు సైలెంట్ గా ఉంటే.. మరికొందరు స్ట్రాంగ్ రిటార్ట్ ఇస్తున్నారు. మోడలింగ్ తో పాటు గతంలో బిగ్ బాస్ షోలో పోటీ పడి.. ఆ తర్వాత నన్ గా మారి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సోఫియా హయత్.. ఇప్పుడు తనకు రేటు కట్టిన ఓ వ్యక్తిని తెగ తిట్టి పోసింది. ఒక రాత్రి తనతో గడిపితే 20 లక్షలు ఇస్తానంటూ ఒక వ్యక్తి ఆమెకు మెసేజ్ పెట్టాడు. 

దీనికి రిప్లై ఇచ్చిన ఆమె.. '20 లక్షలతో నేను ** తుడుచుకుంటాను. 20 కోట్లు అయినా సరే నన్ను కొనలేవు' అని పోస్ట్ చేసిన సోఫియా హయత్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసి షేర్ చేసింది. అంతే కాదు.. ఆ 20 లక్షలు మీ అమ్మన కొనగలవేమో ఓ సారి అడిగి చూడు అంటూ చెప్పుచ్చుకు కొట్టిన రీతిలో రిప్లై ఇచ్చింది సోఫియా హయత్. 

PREV
click me!

Recommended Stories

The Paradise Teaser: దసరా మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాని ప్యారడైజ్ టీజర్ ఎలా ఉందంటే?
OG-Varun Tej: ఓజీతో కొరియన్‌ కనకరాజు పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన మెగా ప్రిన్స్