కాన్సెప్ట్ ఏదైనా పవన్ సినిమాలలో అది కామన్ అట..!

By Satish ReddyFirst Published Sep 4, 2020, 3:05 PM IST
Highlights

రానున్న రెండు మూడేళ్ళలో పవన్ నుండి ఏకంగా నాలుగు చిత్రాలు రానున్నాయి. కమ్ బ్యాక్ తో మూడు సినిమాలు ప్రకటించిన పవన్, పుట్టినరోజు నాడు సురేంధర్ రెడ్డితో మరో మూవీ ప్రకటించారు. ఐతే ఈ నాలుగు సినిమాల్లో కూడా కామన్ గా ఒక పాయింట్ ఉంటుందట. 
 

మరో మూడేళ్లు పవన్ సినిమాలతో ఫుల్ బిజీ అని చెప్పాలి. పవన్ మొత్తంగా నాలుగు చిత్రాలలో నటిస్తుండగా, వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇక దర్శకుడు క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు హరీష్ తో ప్రకటించిన పవన్ 28వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా సురేంధర్ రెడ్డితో ప్రకటించిన మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలుకానుంది. 

క్రిష్ మరియి హరీష్ శంకర్ చిత్రాలను ఏక కాలంలో పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ రెండు పూర్తయిన తరువాత లేదా చివరి దశలో సురేంధర్ రెడ్డి మూవీలో నటించనున్నారు. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేయనున్నారు. కాగా వకీల్ సాబ్ పూర్తిగా సామాజిక కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం. క్రిష్ మూవీలో పేదలకు మంచి చేసే బందిపోటుగా ఆయన కనిపిస్తారని తెలుస్తుంది. 

ఇక హరీష్ శంకర్ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ చూసినా కూడా సోషల్ సబ్జెక్టు అనేది ప్రధానంగా ఉండే అవకాశం కలదని అర్థం అవుతుంది. పవన్ ఇప్పుడు సినిమా హీరో కంటే కూడా పోలిటిషియన్ గానే బాగా ఫేమస్. అలాగే ఆయన సీరియస్ పొలిటీషియన్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నుండి రానున్న ప్రతి మూవీలో సోషల్ కాన్సెప్ట్, పొలిటికల్ సెటైర్స్ కామన్ గా ఉంటాయని టాక్. 

click me!