చివరి సినిమా ఉక్కు సత్యాగ్రం.. చూడకుండానే కన్నుమూసిన గద్దర్..

Published : Aug 06, 2023, 05:43 PM ISTUpdated : Aug 06, 2023, 05:50 PM IST
చివరి సినిమా ఉక్కు సత్యాగ్రం.. చూడకుండానే కన్నుమూసిన గద్దర్..

సారాంశం

పేదల గొంతు మూగపోయింది. ప్రజా నౌక ఆగిపోయింది. జన హృదయాలను తన పాటలతో.. గానంతో ఉత్సాహపరిచి.. ధైర్యం నింపిన ప్రజా గాయకుడు గద్దర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. చివరిగా ఆయన ఓ ఉద్యమ సినిమాలో నటించారు. కాని ఆసినిమా రిలీజ్ ను చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.   

ప్రజా చైతన్య గాయకుడు గద్దర్ కన్నుుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ  ఈరోజు( అగస్ట్ 06)న  తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు అధికారికంగా వెల్లడించారు.  కాగా ఎన్నో ఉద్యమ పాటలకు ఊపిరి పోశారు గద్దర్. ఆయన ప్రజా గాయకుడిగా ఉంటేనే కొన్ని సినిమాల్లో నటించారు.సినిమాలకుపాటలు రాశారు. సూపర్ హిట్ పాటలు అందించారు. చివరి సారిగా గద్దర్ నటించిన సినిమా రిలీజ్ అవ్వకముందే ఆయన తుది స్వాసవిడిచారు. 

సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో  రూపొందిస్తున్న ఈ చిత్రమిడి.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  గద్దర్ కీలక పాత్ర పోషించడమే కాకుండా పాటలు కూడా రాసారు. గద్దర్ మరణవార్త తెల్సుకున్న ఈ చిత్ర బృందం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌గారు చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ చేశారు. ఆయన నటించిన చివరి చిత్రం ఇదే! ఇటీవల రీ రికార్డింగ్‌ పనుల్లో పాల్గొన్నారు. ఆయన మరణించడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా టీమ్‌ అందరి తరఫున కోరుకుంటున్నాం’’ అని అన్నారు. 

జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్నారు. అప్పట్లో స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం జరిగిన పోరాటం, ఈనాడు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది.ఈసినిమా కోసం గద్దర్  తో పాటు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ్ కూడా పాటలు రాశారు.అయితే ఈసినిమా ను చాలా త్వరగా రిలీజ్ చేయాలి అని చూశారు మూవీ టీమ్. త్వరలోనే విశాఖ పట్టణంలో ఆర్కే బీచ్ లో ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని అనుకున్నారు.

అంతే కాదు ఈ ఈవెంట్ గురించి ప్రకటన కూడా చేశారు. ఈ ప్రీరిలీజ్ కోసం చీఫ్ గెస్ట్ గా ఓ పెద్ద వ్యాక్తిని తీసుకురావాలి అని చూశారు. కాని ఈలోపు గద్దర్ మరణం మూవీ టీమ్ షాక్ కు గురి చేసింది. సినిమా కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుటున్న టైమ్ లో గద్దర్ తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఇక   గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్
చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?