అక్కినేని కోడలు కాబోతూ ఐటెం సాంగ్ ?.. ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ?

అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా అక్కిని నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరూ రహస్య ప్రేమలో ఉంటూ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు.


అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా అక్కిని నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరూ రహస్య ప్రేమలో ఉంటూ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయ్యారు. 

ప్రస్తుతం శోభిత సినిమాల్లో రాణిస్తోంది. బాలీవుడ్ లో సైతం ఆఫర్స్ అందుకుంటోంది. శోభిత త్వరలో అక్కినేని ఫ్యామిలీ కోడలు కాబోతుండడంతో ఆమె గురించి ప్రతి చిన్న విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత, నాగ చైతన్య విడిపోయాక.. సమంతపై చాలా విమర్శలు వచ్చాయి. డివోర్స్ తర్వాత సమంత పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. 

Latest Videos

ఇదిలా ఉండగా తాజాగా శోభిత గురించి బాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. శోభితకి బాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ డాన్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. డాన్ 3 చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రంలో ఒక గ్లామరస్ ఐటెం సాంగ్ ని ఫ్లాన్ చేశారట. ఈ సాంగ్ కి శోభిత అయితే బావుంటుందని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శోభిత తో ఫర్హాన్ పలుమార్లు భేటీ అయ్యారట. ఐటెం సాంగ్ గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. శోభిత ఒక వేళ ఐటెం సాంగ్ చేస్తే అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటారు ? అసలు ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరిస్తారా అనే కోణంలో సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. 

click me!