దేవిశ్రీ ప్రసాద్ లవర్ కి పెళ్లైందట!

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 4:54 PM IST
Highlights

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ నటి పూజిత పొన్నాడని పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ వార్తలు ఇప్పటివికావు.. కొన్ని నెలల క్రితమే ఇలాంటి గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు మళ్లీ యూట్యూబ్ లో ఈ విషయాన్ని ట్రెండింగ్ గా మార్చేశారు.

టాలీవుడ్ లో చాలా సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది పూజిత. 'రంగస్థలం', 'బ్రాండ్ బాబు' ఇలా చాలా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పూజిత మొదటి షార్ట్ ఫిలిమ్స్ లో ఎక్కువగా నటించేంది. ఆ విధంగా ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ఇక్కడ అసలు విషయమేమిటంటే.. పూజితకి ఇదివరకే పెళ్లైంది.

యూట్యూబ్ నటుడు అర్జున్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పూజిత. ప్రస్తుతం ఆమె తన భర్తతోనే కలిసి ఉంటుంది. పెళ్లి కూడా అయిన అమ్మాయితో దేవిశ్రీప్రసాద్ తో ప్రేమ అంటూ కావాలనే కొందరు వార్తలు పుట్టిస్తున్నారు.

తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా.. కెరీర్ పరంగా తనను ఏదీ అడ్డుకోలేదని అంటోంది పూజిత. ప్రస్తుతం ఈ బ్యూటీ 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' అలానే మరికొన్ని సినిమాలలో నటిస్తోంది.

ద్యావుడా: దేవిశ్రీప్రసాద్ కు పెళ్లి..ఆమెతోనా? 

Last Updated Nov 21, 2018, 4:54 PM IST