Skanda Collections: `స్కంద` మొదటి రోజు వసూళ్లు.. బిజినెస్‌ ఎంత? ఎంత రావాలి?

రామ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `స్కంద` మూవీ గురువారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. అయితే కలెక్షన్ల పరంగా ఇది బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. 

skanda movie first day collections and business details arj

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో `స్కంద` చిత్రం రూపొందింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గురువారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. బోయపాటి మార్క్ యాక్షన్‌ ఇష్టపడే వారికి అంతో ఇంతో నచ్చుతుంది, యాక్షన్‌ నచ్చని వారికి ఈ సినిమా నచ్చడం కష్టం. అయితే ఈ సినిమా మొదటి రోజు మాత్రం అదిరిపోయే కలెక్షన్లని రాబట్టింది. రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. 

ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.18.2కోట్లు వసూలు చేసింది. ఇది రామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇక తెలుగులో రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి కలెక్షన్లని సాధించింది. ఎనిమిదిన్నర కోట్ల(8.62) షేర్‌ని సాధించింది. నైజాంలో అత్యధికంగా 3.23 కోట్లు, వైజాగ్‌లో 1.19కోట్లు, ఈస్ట్, వెస్ట్-కోటి, కృష్ణ 45లక్షలు, గుంటూరు కోటి, నెల్లూరు 49 లక్షలు వసూలు చేయగా, సీడెడ్ 1.22కోట్లు రాబట్టింది. మిశ్రమ స్పందనలోనూ ఈ చిత్రం ఇంతటి వసూళ్లు సాధించడం విశేషం. 

Latest Videos

ఈ వారం విడుదలైన చిత్రాల్లో మిగిలిన సినిమాలు పెద్దగా ఆకట్టుకునేలా లేదు. `పెదకాపు1` కి డివైడ్‌ టాక్‌ వచ్చింది. `చంద్రముఖి2` డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ఇది అంతో ఇంతో `స్కంద`కి హెల్ప్ కానుందని చెప్పొచ్చు. అయితే ఇందులో మితిమీరిన హింస మైనస్‌ అని చెప్పొచ్చు. యాక్షన్‌ ఓవర్‌ డోస్‌, కథ లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడం మైనస్‌గా చెబుతున్నారు. కానీ యాక్షన్, ఎలివేషన్లు సినిమాని నిలబెడతాయేమో చూడాలి. 

CULT JATHARA EVERYWHERE 🔥

Massive celebrations by Ustaad 's Fans in every centre for the blockbuster 💥

Book Tickets for 🔥

🎟- https://t.co/2KCFrBAwQjpic.twitter.com/zlOMng26Hy

— Srinivasaa Silver Screen (@SS_Screens)

ఇక సినిమా రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందింది. అదే సమయంలో సినిమా బిజినెస్‌ కూడా గట్టిగానే జరిగింది. సుమారు 49కోట్లు బిజినెస్‌ చేసిందని సమాచారం. నైజాంలో ఇది రూ.14కోట్లు, ఆంధ్రాలో 20కోట్లు, సీడెడ్‌లో 9కోట్ల బిజినెస్‌ అయ్యిందట. సౌత్‌, నార్త్ కలిపి మూడు కోట్లు, ఓవర్సీస్‌లో 2.20కోట్లు బిజినెస్‌ అయ్యిందట. ఈ లెక్కన ఈ చిత్రం యాభై కోట్ల షేర్‌ సాధిస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. అంటే వంద కోట్లకుపైగా కలెక్షన్లు రాబడితే అంతా సేఫ్‌. మరి ఏ మేరకు వెళ్తుందో చూడాలి. 
 

vuukle one pixel image
click me!