గీతా మాధురి, సత్య యామిని, అనుదీప్‌, సాకేత్‌.. పాట కోసం ఆరుగురు స్టార్‌ సింగర్స్.. ట్రెండింగ్‌

Published : Sep 19, 2022, 03:37 PM IST
గీతా మాధురి, సత్య యామిని, అనుదీప్‌, సాకేత్‌.. పాట కోసం ఆరుగురు స్టార్‌ సింగర్స్.. ట్రెండింగ్‌

సారాంశం

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు స్టార్‌ సింగర్స్ కలిశారు. ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం వీరింతా కలిసి పాడటం విశేషం. తాజాగా ఆ పాట ట్రెండింగ్‌లో ఉంది.

టాలీవుడ్‌ టాప్‌సింగర్స్ కలిశారు. ఓ పాట కోసం వారంతా ఏకమయ్యారు. అద్భుతమైన గాత్రంతో పాటకి ప్రాణం పోశారు. `గౌరీ కళ్యాణ వైభోగమే` అంటూ సాంగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ప్రస్తుతం తెలుగులో రాణిస్తున్న స్టార్‌ సింగర్స్ లో గీతా మాధురి, సత్య యామిని, మనీషా, సమీర భరద్వాజ్‌, సాకేత్‌, అనుదీప్‌ ప్రధానంగా రాణిస్తున్నారు. వీరింతా ఓ పాటకోసం ఏకం కావడం విశేషం. వినూత్న ప్రయత్నానికి శ్రీకారంచుట్టడం మరో విశేషం. 

ఓ ప్రముఖ టెక్స్ టైల్‌ సంస్థ(గౌరీ) కోసం వీరంతా కలిసి అద్భుతమైన పాటని ఆలపించడం విశేషం.  ఈ సింగర్స్ ద్వారా తమ కలెక్షన్లని ఆడియెన్స్ కి పరిచయం చేసింది. ఈ వినూత్న ఆలోచనకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఆరుగురు స్టార్స్ సింగర్స్ ఈ పాటని ఆలపించడం హైలైట్‌గా నిలిచింది. అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. 

`గౌరీ కళ్యాణ వైభోగమే` అంటూ సాగే ఈ పాటకి కేశవ కిరణ్‌ సంగీతం అందించడంతోపాటు పాటకి సాహిత్యాన్ని అందించారు. విన్ను ముత్యాల  ఈ స్పెషల్‌ సాంగ్‌ కి దర్శకత్వం వహించారు.కెమెరా వర్క్ పరంగా సురేష్‌ చిత్రీకరించిన విజువల్స్ పాట సాహిత్యాన్ని గుర్తించి మరింత సహజత్వాన్ని అందించారు. నాలుగు నిమిషాల పాటు సాంగే ఈ పాట లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. సహజత్వానికి పెద్ద పీఠ వేస్తూ కంపోజ్‌ చేసిన బాణీలు, సాహిత్యం సాధారణ ఆడియెన్స్ ని సైతం ఆకట్టుకుంటుంది. 

ఇదిలా ఉంటే ఆరుగురు సింగర్స్ ఇందులో కనిపిస్తున్నారు. పాటని ఆలపిస్తూ, అద్భుతమైన హవభావాలతో మంత్రముగ్దుల్ని చేస్తున్నారు. అయితే ఒక పాటని ఆరుగురు సింగర్స్ కలిసి పాడటం అనేది చాలా అరుదు. పైగా ఓ ప్రైవేట్‌  స్పెషల్‌ సాంగ్‌ కావడంతో దీనికి మరింత ఆదరణ దక్కుతుంది. స్టార్‌ సింగర్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ పాటకి విశేషం ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో యూనిట్‌ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?