‘గేమ్ ఛేంజర్’ కోసం ఆరుగురు టాప్ కొరియోగ్రాఫర్స్? థియేటర్లు బద్దలవ్వాల్సిందే.. డిటేయిల్స్

By Asianet News  |  First Published Mar 27, 2023, 11:54 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆరుగురు టాప్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తుండటం విశేషం మారింది. తాజాగా ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా  మారాయి. 
 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం Game Changer.  చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఉదయం టైటిల్ మరియు లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ టైటిట్  పర్ఫెక్ట్ గా సూట్ అయిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక థమన్ అందించిన బీజీఎం సైతం ఆకట్టుకుంటోంది. కాగా, మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 

‘గేమ్ ఛేంజర్’ కోసం ఏకంగా ఆరుగురు టాప్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వారిలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, గణేశ్ ఆచార్య, ‘ఆర్ఆర్ఆర్’ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, బోస్కో మార్టిస్, జానీ మాస్టర్, సాండీల పేర్లు వినిపిస్తున్నాయి. సౌత్, నార్త్ లో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న వీరు చిత్రంలోని అన్నీ సాంగ్స్ ను చరణ్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించబోతున్నారు. అటు థమన్ సంగీతం, ఇటు ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్స్ డాన్స్ కు థియేటర్లు బద్దలవ్వాల్సిందేనని అంటున్నారు. 

Latest Videos

చరణ్ కూడా డాన్స్ ఇరగదీసే వాడు కావడంతో ఒక్కో సాంగ్ ఒక్కో సెన్సేషన్ గా మారిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ రామోజీ ఫిల్మ్ లో నిర్మించిన అద్భుతమైన సెట్ లో 10 రోజుల పాటు ఓ సాంగ్ ను షూట్ చేసిన విషయం తెలిసిందే. మరోసాంగ్ కోసం ఏకంగా 500కు పైగా డాన్సర్లతో స్టెప్పులు వేయించినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ప్రభుదేవా సైతం ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా సెట్స్ లో చరణ్ బర్త్ డే సెబ్రేషన్స్ లోనూ ప్రభుదేవా సందడి చేశారు. 

‘గేమ్ ఛేంజర్’లో మొత్తం ఆరుసాంగ్స్ ఉండబోతున్నాయని అప్పట్లో థమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఆరు సాంగ్స్ కోసమే ఆరుగురు కొరియోగ్రాఫర్లు ప్రత్యేకంగా వర్క్ చేస్తున్నట్టు టాక్. థమన్ సంగీతం, వీరి డాన్స్ కు థియేటర్లు ఊగిపోతాయనే అంటున్నారు. కేవలం సాంగ్స్ షూటింగ్ కే కోట్లల్లో వెచ్చిస్తుండటం విశేషం. మరోవైపు యాక్షన్ నన్నివేశాలు కూడా కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కేవలం ఏడు నిమిషాల యాక్షన్ సీన్ కే రూ.70 కోట్లు ఖర్చు చేశారంటే ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్బరివ్ పోరాట సన్నివేశాలను పెద్దఎత్తున్న చిత్రీకరించినట్టు తెలుస్తోంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 170కు పైగా బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani)  చెర్రీ సరసన నటిస్తోంది. అంజలి, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!