లాస్ట్ మినిట్ లో 'ఆయలాన్' రిలీజ్ కి బ్రేక్, కారణం

Published : Jan 26, 2024, 03:00 PM IST
 లాస్ట్ మినిట్ లో  'ఆయలాన్' రిలీజ్ కి బ్రేక్, కారణం

సారాంశం

శివ కార్తికేయన్ అయలాన్ సినిమా తెలుగు వెర్షన్‌ను జనవరి 26న రిలీజ్ చేయాలనున్నారు మేకర్స్. అయితే  ఇలా అర్ధాంతరంగా షాక్ ఇవ్వడం ఊహించనిది. ఈ రోజు ఏపీ తెలంగాణ అన్ని చోట్ల ఎక్కడా షోలు పడలేదు.


 తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆయలాన్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఆయలాన్ మూవీ ఈ రోజు తెలుగులోనూ విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోని విధంగా  ఆయాలన్ రిలీజ్ ఆగిపోయింది. మార్నింగ్ షోలు పడకపోవటం అందరికీ షాక్ ఇచ్చింది. మార్నింగ్ ,మాట్నీ షోలకు బుక్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్ మెసేజులు వస్తుండగా, డైరక్ట్ గా థియేటర్లకు వెళ్లిన వాళ్లకు షో లేదని చెప్పింది.  ఫైనాన్సియల్ క్లియరెన్స్ లు సమస్య కావటంతో సినిమా ఆగిందని తెలిస్తోంది.   ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించారు. దీనికి ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అయలాన్ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది.

అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి కావటంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడింది. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే  అవకాసం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతికి తెలుగులో కూడా విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఇక్కడే ముగ్గురు స్టార్ హీరోలు, ఒక యంగ్ హీరో పోటీ పడుతుంటడంతో అయలాన్‌తో పాటు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాను జనవరి 26న తెలుగులో విడుదల చేస్తుండగా.. శివ కార్తికేయన్ అయలాన్ సినిమా తెలుగు వెర్షన్‌ను జనవరి 26న రిలీజ్ చేయాలనున్నారు మేకర్స్. అయితే  ఇలా అర్ధాంతరంగా షాక్ ఇవ్వడం ఊహించనిది. ఈ రోజు ఏపీ తెలంగాణ అన్ని చోట్ల ఎక్కడా షోలు పడలేదు.

  తెలుగు రాష్ట్రాల్లో  గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న 'వరుణ్ డాక్టర్' సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే, ఇప్పటికే అయలాన్ తమిళనాడులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయలాన్ మూవీలో శివ కార్తికేయన్‌, రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు ఇషా కొప్పికర్, 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?