తెలుగులో మళ్ళీ వచ్చేస్తోన్న రాఖీ భాయ్... రీ రిలీజ్ కు సన్నాహాలు..

Published : Jan 26, 2024, 02:12 PM IST
తెలుగులో మళ్ళీ వచ్చేస్తోన్న రాఖీ భాయ్... రీ రిలీజ్ కు సన్నాహాలు..

సారాంశం

రాఖీ బాయ్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. అవును.. థియేటర్లు దద్దరిల్లేలా.. కుర్రాళ్ల చేయత విజిల్స్ వేయించడానికి.. రాఖీ భాయ్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈన్యూస్ లో నిజం ఎంత..? 

ఇండియాన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన అతి కొద్ది సినిమాల్లో కెజియఫ్ కూడా ఉంది. కన్నడ సినిమాగా చాలా సైలెంట్ గా వచ్చి.. అన్ని భాషల్లో సంచలన విజయం సాధించిందీ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ సినిమా సక్సెస్ తో అన్ని ఇండస్ట్రీలు కన్నడ వైపు చూసేలా చేసింది.  గోల్డ్ మైన్స్‏ నేపథ్యంలో వచ్చిన కెజియఫ్ మూవీని  ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా.. యంగ్ హీరో  హీరో యష్ మాస్ లుక్ లో అలరించాడు. చాలా కామ్ గా వచ్చిన ఈసినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర  దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.  వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన 4వ  భారతీయ సినిమాగా నిలిచింది. 

ఇక సెకండ్ పార్ట్ కేజియఫ్ మాత్రం ఇంత సైలెంట్ గా రాలేదు. భారీ అంచనాల నడుమ..అట్టహాసంగా రిలీజ్ అయ్యింది. ఎంత అంచనాలు పెంచిందో... అంతా నిలబెట్టింది కెజియఫ్ 2.  అంతటా ఈసినిమా గురించే మాట్లాడుకున్నారు. అంతే కాదు.. కన్నడ ఇండస్ట్రీ కెజియఫ్ సినిమా వల్లే కాస్త వెలుగులోకి వచ్చింది. ఆతరువాత వచ్చిన కాంతార ఈ వేవ్ ను నిలబెట్టింది. ఇక కెజియఫ్ సినిమాలో యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో నిర్మించింది. ఇక యాక్షన్ ప్రియులంతా.. అంతా కేజీఎఫ్ 3 కోసం ఎదురు చూస్తున్న క్రమంలో..తాజాగా కేజీఎఫ్  సినిమాకు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. 

తాజా సమాచారం ప్రకారం కెజియఫ్  తెలుగు వర్షన్ ను రీ రిలీజ్ చేసేందుకు చూస్తున్నారట. అవును ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ఇదే.  హైదరాబాద్‏లో ఫిబ్రవరి 3న ఈ సినిమా తెలుగు వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారని టాక్. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కాని.. ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎంత ఓటీటీల్లో చూసినా.. ఇటువంటి సినిమాలను థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ కిక్కే వేరు. ఆ కిక్కు కోసం పక్కాగా ఈమూవీని ఆధరిస్తారని నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇక  మరోసారి కేజీఎఫ్ విడుదల కాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్