ఫ్రెండ్స్ ని ఆదుకోవాలని ప్రయత్నిస్తే.. హీరో పంట పండింది!

Published : Jul 02, 2019, 02:33 PM IST
ఫ్రెండ్స్ ని ఆదుకోవాలని ప్రయత్నిస్తే.. హీరో పంట పండింది!

సారాంశం

తమిళ స్టార్ హీరోకి శివ కార్తికేయన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. శివ కార్తికేయన్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. అజిత్, విజయ్ తరహాలో ఏడాదికి ఒక సినిమా కాకుండా ఈ హీరో రెండు మూడు చిత్రాలని రిలీజ్ చేస్తుంటాడు. 

తమిళ స్టార్ హీరోకి శివ కార్తికేయన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. శివ కార్తికేయన్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. అజిత్, విజయ్ తరహాలో ఏడాదికి ఒక సినిమా కాకుండా ఈ హీరో రెండు మూడు చిత్రాలని రిలీజ్ చేస్తుంటాడు. సంపాదన కూడా బాగానే ఉంది. ఇటీవల హీరోలు కూడా నిర్మాణ రంగంపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. 

శివ కార్తికేయన్ నిర్మాతగా ''నెంజంయుండు నేరమైయుండు ఓడు రాజా' చిత్రాన్ని రూపొందించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. సొంతంగా ఎస్ కె ప్రొడక్షన్స్ ని స్థాపించి శివకార్తికేయన్ నిర్మించిన చిత్రం ఇది. తాను నిర్మించిన చిత్రం సక్సెస్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

ఇటీవల ఈ చిత్ర సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో శివకార్తికేయన్ మాట్లాడుతూ..  స్నేహితులకు చేయూత అందించేందుకే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు శివకార్తికేయన్ తెలిపాడు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు కార్తీక్ వేణుగోపాల్ ఈ హీరోకి మంచి స్నేహితులు. 

బుల్లి తెరపై, యూట్యూబ్ లో తమ ప్రతిభ చాటుకునేందుకు కష్టపడుతున్న వీరందరిని ఒకదగ్గరకు చేర్చి శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా శివకార్తికేయన్ స్నేహితులకు మంచి గుర్తింపు రాగా, కమర్షియల్ గా కూడా లాభాలని తెచ్చిపెడుతోంది. 

PREV
click me!

Recommended Stories

Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే
Aamir Khan Wedding: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో, అమీర్ ఖాన్ వెడ్డింగ్ డేట్ ఎప్పుడంటే?